కేబినెట్ లో బీజేపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్ - నాగబాబు ఎంట్రీ ఇక..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల వేళ కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీ లక్ష్యంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ సైతం కూటమిని టార్గెట్ చేస్తూ తమ కార్యాచరణ అమలు చేస్తోంది. కాగా.. ఏపీ మంత్రివర్గంలో మార్పుల పైన కొద్ది రోజులుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొత్త అంశాలు చర్చగా మారాయి.
ఏపీలో స్థానిక సంస్థలకు సిద్దం అవుతున్న వేళ రాజకీయంగా కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు అయి 26 నెలలు పూర్తయింది. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తొలుత భావించినా స్థానిక ఎన్నికల తరువాతనే జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీకి మరో మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలోనే మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రి పదవి పైన హామీ ఇచ్చారు. నాగబాబుకు ఇంకా మంత్రి పదవి సాకారం కాలేదు. కేబినెట్ ప్రక్షాళన సమయంలో నాగబాబుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కి మరో మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని కూటమి నేతల ద్వారా తెలుస్తోంది. దీంతో, గతంలోనే బీజేపీకి రెండో మంత్రి పదవి పైన హామీ ఉన్నట్లు చెబుతున్నారు.

కేబినెట్ లో మార్పులు- చేర్పులు ఉండేనా..!?
తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు.. ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో బీజేపీకి అవకాశం దక్కలేదు. దీంతో.. ఇప్పుడు బీజేపీకి మరో మంత్రి పదవి పైన చర్చ తెర మీదకు వచ్చినట్లుగా పార్టీ నేతల సమాచారం. త్వరలో కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో మంత్రి పదవి దక్కనుంది. ఈ లెక్కల వేళ ఏపీలోనూ బీజేపీకి మంత్రి పదవి దక్కనుందని చెబుతున్నారు. కాగా.. కూటమి పాలన.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో పాటుగా గతంలో పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పేరు మంత్రివర్గ రేసులో ఉన్నారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో చివరగా ఈ మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.



Click it and Unblock the Notifications