బిజెపికి ఎమ్మెల్యే షాక్ : జనసేన లో ఎంట్రీ ఖాయం..!
ఏపి బిజెపి లో షాకింగ్ పరిణామం. బిజెపి వాయిస్ బలంగా వినిపించే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనా మా చేసారు. నేరుగా తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కు అందచేసారు. ఇక, ఆయన ఏపి లో జనసేన నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఆ పార్టీలో అధికారికంగా చేరటమే మిగిలింది.
ఏపి కి బిజెపి అన్యాయం చేసిందని టిడిపి..ఏపికి టిడిపి అన్యాయం చేస్తుందని బిజెపి ఆరోపణలు చేసుకుంటూ.. రోడ్ల పై పోరాటాలకు దిగుతున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే బిజెపి ని వీడారు. రాజమండ్రి బిజెపి ఎమ్మెల్యేల ఆకుల స త్య నారాయణ పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను నేరుగా బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కు అం దచేసారు. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమైంది. దీంతో..ఆకుల రాజనామా విషయంలో పార్టీ అధినేత సైతం పెద్దగా రియాక్ట్ అవ్వలేదని సమాచారం. ఇక, రాష్ట్ర స్థాయిలోని బిజెపి నేతలు సైతం ఆకుల రాజీనా మా పై స్పందించ లేదు. ఆకుల రాజీనామా పై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీని వీడటానికి సిద్ద పడుతున్నారని..కుటుంబ సభ్యులతో కలిసి మరో పార్టీలో చేరటానికి సద్దమయ్యారని ప్రచార సారాంశం.

జనసేన లోకి ఎంట్రీ..
ఆకుల సత్యనారాయణ బీజేపీలో ఉండగానే ఆయన సతీమణి జనసేనలో పనిచేస్తున్నారు. గతకొద్ది రోజులుగా సత్య నారాయణ జనసేనలో చేరతారని ప్రచారం రుగుతున్నా..ఇప్పుడు అది నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆకుల దం పతుల్లో ఒకరికి ఎంపీ, మరొకరికి ఎమ్మెల్యే సీటు ఖాయమైనట్లు వార్తలు వినవస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాగా త్వరలోనే ఆయన పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని సమాచారం. దీంతో..మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కామినేని శ్రీనివాస్ పార్టీలోనే ఉన్నా..యాక్టివ్ గా ఉండటం లేదు. పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు సైతం పార్టీని వీడటానికి సిద్దపడుతున్నారు. మాణిక్యాల రావు మాత్రం పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications