వైసీపీ వింతలపై విచారణ జరిపిస్తాం, ఆఫీసులో జూదం, సెటిల్మెంట్లు, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్
ఆంధ్రప్రదేశ్ లో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై విచారణ జరిపిస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఆదోని పట్టణంలో అనుమతులుల లేకుండా నిర్మించిన వైసీపీ భవనం విషయంలో విచారణ జరిపిస్తామని, తప్పుడు పనులు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు.
ఆదోనిలో విలేకరులతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైసీపీ కార్యాలయాల కట్టడాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలు గత ఐదుళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని ఎద్దేవ చేశారు. ఆదోని పట్టణంలోని పాత ఎన్ జీఓ భవనాన్ని కేవలం రూ. 40 లక్షలకు 99 ఏళ్ల సంవత్సరాల లీజుకు తీసుకున్న ఘనత వైసీపీకి మాత్రమే చెందుతుందని, ఇది వింత కాదా అని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.

99 ఏళ్లకు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే లీజు చెల్లిస్తే సంవత్సరాలనికి ఎంత చెల్లిస్తున్నారని, నెలకు ఎంత చెల్లిస్తున్నారనేది ఆ వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని డాక్టర్ పార్థసారథి డిమాండ్ చేశారు. ఆదోని పట్టణంలోని పాత ఎన్ జీఓ భవనాన్ని కేవలం రూ. 40 లక్షలకు 99 ఏళ్ల పాటు వైసీపీ నాయకులకు అప్పగించడం నిజంగానే వింత అని, దేశంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.
ఆదోని అప్పటి ఎన్ జీవో అసోసియేషన్ ఉద్యోగి వైసీపీ నాయకులు భవనం లీజుకు ఇచ్చారని, ఆయన కూడా ఇటీవల రిటైడ్ అయ్యారని, దీనిపై విచారణ జరిపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. అదోనిలో పాత ఎన్ జీఓ భవనాన్ని కూల్చేసి తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లా వైసీపీ కార్యాలయం నిర్మించి దానిని అడ్డగా చేసుకుని జూదం ఆడటం, సెటిల్ మెంట్లు చెయ్యడం మొదలుపెట్టారని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదోని పట్టణంలో పాత ఎన్ జీఓ భవనం వైసీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చిన అధికారులు, వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ వదిలిపెట్టమని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ప్రభుత్వ భూములు లీజులకు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించడం ఇప్పుడు వివాదాలకు కారణం అయ్యింది. వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై విచారణ జరిపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications