విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం..

సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విదేశీ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది. లండన్ పర్యటనలో భాగంగా అక్కడి ఓ సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ బాత్రూమ్‌లో జారిపడిన ఆయనకు కుడిచేయికి తీవ్రంగా గాయమైంది. ఎముక విరిగినట్టు సమాచారం.

ప్రమాదం అనంతరం లండన్‌లో ప్రాథమిక వైద్యం పొందిన సుజనా చౌదరిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనను బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

bjp-mla-sujana-chowdhury-seriously-injured-in-london

ప్రస్తుతం సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి సమాచారం కోసం ఆసుపత్రి నుంచి అధికారిక హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఊహించని ఘటనతో బీజేపీ కార్యకర్తలు, సుజనా చౌదరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+