కేసీఆర్, జగన్ పై గురి పెట్టిన బీజేపీ..!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం లోకి రావటంతో ఇప్పుడు బీజేపీ నాయకత్వం తెలంగాణ పైన ఫోకస్ చేసింది. తెలంగాణలోనూ కూటమి విస్తరణ పైన కసరత్తు చేస్తోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర నేతలతో మంత్రాంగం సాగుతోంది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్ లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో ఎదిగేలా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు వైసీపీ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్ లక్ష్యంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో కూటమి నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. కూటమి భవిష్యత్ లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు. కూటమి లక్ష్యం వైఎస్సార్‌సీపీ ఖాళీ చేయడమేనని.. జగన్ పార్టీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేసారు. మళ్ళీ సిఎం అవు తానని జగన్ కలలు కంటున్నారని.. అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఏపిలో ప్రతిపక్ష నాయకుడు శాసన సభకు వెళ్ళడం లేదని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతున్నారని.. 2014లో వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ సభకు వెళ్ళలేదని వీర్రాజు చెప్పుకొచ్చారు.

2024లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ప్రతి పక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేసారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్‌ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పైన సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన రాత్రి పూట సరిగా నిద్ర పోవడంలేదని, కేసీఆర్ తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల కోసం ఆలోచిస్తున్నారని, వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కళ్లబొల్లి కబుర్లు చెప్పి పదేళ్లు తెలంగాణను పాలించారని సోము వీర్రాజు ఆరోపించారు. డీ లిమిటే షన్ విషయంలో అర్దం లేని చర్చలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే ఎక్కువ కాలం ఉండద ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్, జగన్ ను ఉద్దేశించి సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications