వంగవీటి పేరు ప్రకటించాలి - రాజ్యసభ వేదికగా జీవీఎల్..!!
కాపుల రిజర్వేషన్ల అంశ పార్లమెంట్ లో ప్రస్తావించిన జీవీఎల్ ఇప్పుడు వంగవీటి గురించి సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. విశాఖ నుంచి బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నారు. ఇదే సమయంలో కాపు వర్గానికి మద్దతుగా నిలుస్తూ..దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాపుల రిజర్వేషన్ల అంశ పార్లమెంట్ లో ప్రస్తావించిన జీవీఎల్ ఇప్పుడు వంగవీటి గురించి సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. రంగాను కొన్ని వర్గాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావిస్తారని చెప్పుకొచ్చారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేసారు.
రాజ్యసభ వేదిగా ఎంపీ జీవీఎల్ కొత్త ప్రతిపాదనలు చేసారు. వంగవీటి రంగా మరణించి 36 ఏళ్లు అయినా..ఇప్పటికీ ప్రజలు ఆయన్ను స్మరించుకుంటారని చెప్పుకొచ్చారు. · పేద, బడుగు, బలహీన వర్గాలు ఆరాధ్య దైవంగా కొలుస్తారని వివరించారు. వంగవీటి మోహనరంగా గురించి తెలియని తెలుగువారు ఉండరని పేర్కొన్నారు. రంగా ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు లభించిందని వివరించారు.

1986 డిశెంబరు నెలలో కొందరు ద్రోహులు రంగాను హతమార్చారని వ్యాఖ్యానించారు. ఏ· ఆయన రాజకీయ శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతున్న తరుణంలో హత్య జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చిందని.. ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు. కానీ, రంగా పేరును మాత్రం పెట్టలేదని సభలో పేర్కొన్నారు.
కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేసారు. విజయవాడఅ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖను కోరారు. కొంత కాలంగా ఎంపీ జీవీఎల్ కాపు అంశాల పైన ప్రధానంగా ప్రస్తావన చేస్తున్నారు. ఇటీవల విశాఖలో కాపు సంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశంలో జీవీఎల్ నరసింహారావుకు సన్మానం చేశారు.

పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పరిధిలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ అమలు పైన ప్రస్తావించారు. దీని పైన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా కీలక వ్యాఖ్యలు చేసారు. కాపు సంఘాలతో జీవీఎల్ నరసింహారావు సన్మానాలు చేయించుకుంటున్నారని.. కాపులకు ఆయనేం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు వంగవీటి పేరు విమానాశ్రయానికి పెట్టాలనే డిమాండ్ త మరోసారి చర్చకు కారణమయ్యారు.












Click it and Unblock the Notifications