బీజేపీకి కీలక నేత రాజీనామా - అసంతృప్తి వెనుక..!!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల మధ్య రెండో విడత మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటు పూర్తయింది. అభ్యర్ధులను ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే బీజేపీకి చెందిన ముఖ్య నేత పార్టీ వీడుతూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వెనుక కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీశ్ ప్రభాకర్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా బాపట్ల మున్సిపాలిటీని బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఇస్కా సునీల్‌ను ప్రకటించడాన్ని సతీశ్ వ్యతిరేకించారు. ఏకపక్షంగా స్థానికేతరుడిని ప్రతిపాదించారంటూ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు పంపారు. ఏడేళ్లుగా నిబద్ధత గల కార్యకర్తగా కొనసాగుతున్నానని, ఏ సందర్భంలోనూ పార్టీ నుంచి పదవి కోరలేదని తెలిపారు. స్థానికులకు చైర్మన్ సీటు కేటాయించక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పార్టీ నాయకత్వం చర్య స్థానిక నాయకులను అవమానించడం, బాపట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం పై ఆయన తీవ్రంగా విమర్శించారు.

బాపట్ల ఛైర్మన్ అభ్యర్ది ఎంపిక పై..
అన్నం సతీష్ టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసారు. ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2014లో బాపట్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి కీ, ఆయనకు విజయం సాధించలేకపోయారు. కాగా.. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాటి రాజకీయ పరిణామాల్లో భాగంగా పార్టీ వీడారు. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఆ సమయంలో బీజేపీలో విలీనం అయ్యారు. కాగా.. నాడు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేత తో సత్సంబంధాలు ఉన్న అన్నం ప్రభాకర్ ఆయనతో పాటే బీజేపీలో చేరారు. కాగా.. ఇప్పుడు పార్టీలో జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి విషయంలో తొలి నుంచి తన అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. ఇక, ఇప్పుడు స్థానికులకు ఇవ్వకపోవటంతో పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేసారు.












Click it and Unblock the Notifications
