సానియాపై అంబాసిడర్: మళ్లీ బిజెపి ఎమ్యెల్యే వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నియామకాన్ని తప్పు పడుతూ బిజెపి నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలతో జాతీయ నాయకులు విభేదించినప్పటికీ ఆ పార్టీ నాయకులు వ్యతిరేక వ్యాఖ్యలు మానడం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏం ఆశించి సానియా మిర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారని బిజెపి శాసనసభ్యుడు ప్రభాకర్ ప్రశ్నించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసే విషయంలో విధివిధానాలను బయట పెట్టాలని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాసంక్షేమంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే ప్రభాకర్ సూచించారు.

తెలంగాణ బిజెపి నేత డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను బిజెపి జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ తోసిపుచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. సానియా మీర్జా భారతదేశానికి గర్వకారణమని అన్నారు. సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ కావడంపై తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన అన్నారు. సానియా భారత బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.
బిజెపి నేత మురళీ మనోహర్ జోషీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎవరైనా ఓ ప్రకటన చేస్తే, అది ఆ వ్యక్తి సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications