జనసేన నిర్వీర్యానికి బీజేపీ పావులు? వెంటనే మేల్కొన్న పవన్!!
జనసేన పార్టీని భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. తాము ఔన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడానికి సిద్ధమైంది కాబట్టి రెంటికీ చెడ్డ రేవడిలా జనసేనను చేయడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన పవన్ కల్యాణ్ వెంటనే మేల్కొన్నారు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా సొంతంగా మనం ఎన్నికల వ్యూహాన్ని రూపొందించుకుందామంటూ సూచించారు. నేతలు కూడా దీనికి అంగీకరించినట్లు సమాచారం.
గోదావరి గర్జన సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అన్నారేకానీ బీజేపీ -జనసేన రావాలి అని అనలేదు. మీటింగ్‌లో ఎక్కడా జనసేన ప్రస్తావనే తీసుకురాలేదు. వాస్తవానికి బీజేపీ నేతలు ఈ మీటింగ్‌కు పవన్‌కు ఆహ్వానం కూడా పంపలేదని సమాచారం. తనకు కూడా వేరే పనులుండటంవల్ల వెళ్లడంలేదని పవన్ చెప్పారు.

పవన్‌కల్యాణ్ ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించారో అప్పటి నుంచి బీజేపీ నేతలు ఆ పార్టీకి దూరం జరగడం ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రకటన చేసినప్పటి నుంచి జనసేనను నిర్వీర్యం చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ నేతలు పనిచేయడం ప్రారంభించారంటున్నారు. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? ఇద్దరూ కలిసి పొత్తు కొనసాగిస్తారా? జనసేన టీడీపీతో కలిసి ముందుకు వెళుతుందా? అన్నదానిపై తదుపరి రాజకీయాలు ఆధారపడివున్నాయని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications