టీడీపీకి కౌంటర్ : బాబుకు షాకిచ్చేందుకు బీజేపీ రెడీ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ... తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. కేంద్ర బడ్జెట్ పైన తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది.
మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస రావు చాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సహాయ కార్యక్రమాలపై ప్రజలకు టీడీపీ పూర్తిస్థాయిలో తెలియజేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేని వాటిపై విమర్శలు తగదన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత లేదని కొద్ది రోజులుగా టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు చర్చించారు. కేంద్ర బడ్జెట్ పైన విమర్శలు చేస్తే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు.
బీజేపీ ఏపీకి ఏం ఇచ్చింది, ఏం తెచ్చామనేది సభలో గట్టిగా మాట్లాడాలని బీజేపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటే గట్టిగా బదులివ్వాలని నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే, అంతకుముందు దీనిపై ఓసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవాలని నేతలు నిర్ణయించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications