జగన్‌కు బీజేపీ భారీ షాక్ -ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఎంపీ సురేశ్ ప్రభు ఫిర్యాదు -సంచలన లేఖలు
ఎన్డీఏ మిత్రులు సైతం పక్కకు తప్పుకున్నా, తానున్నానంటూ కేంద్ర సర్కారుకు అన్ని విధాలుగా మద్దతు పలుకుతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ భారీ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ(రాజ్యసభ) సురేశ్ ప్రభు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అటు ఇటుగా ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి.. జగన్ తాజా నిర్ణయాలతో మరింతగా దిగజారే ప్రమాదం ఏర్పడిందని, ఈ వ్యవహారంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని సురేశ్ ప్రభు కోరారు.

నిర్మల, గోయల్‌కు లేఖలు..
జగన్ ప్రభుత్వం ఏపీలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు బుధవారం లేఖలు రాశారు. ఇటీవల 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్.. వాటి నిధులను సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటిమరీ సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని సురేశ్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నరేష్ కుమార్ నుంచి తనకు ఓ లేఖ తనకు వచ్చిందని, అందులోని విషయాలు నిజమని తెలిసిన తర్వాతే కేంద్రానికి లేఖ రాస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

బిల్లు పాసైన రోజే ఇలా..
2005 నాటి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలు చేసే బిల్లుకు మంగళవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొద్ది గంటలకే బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు కేంద్రానికి లేఖ రాయడం సంచలనం రేపుతున్నది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులపై రాష్ట్రాలకు సడలింపు లభించడంతో.. ఇప్పటివరకూ ఉన్న 3 శాతం అప్పుల పరిమితిని 5శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. బిల్లు పాసైన రోజే బీజేపీ మెలిక లేఖలు రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాక..
Recommended Video

మోదీకి అత్యంత నమ్మకస్తుడే ఇలా..
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభుకు ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడనే పేరుంది. తొతుత శివసేనకు చెందిన సురేశ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే విషయంలో ఉద్ధవ్ తో విభేధాలు వచ్చినా, ఆయనను బీజేపీలోకి చేర్చుకుని మరీ మోదీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత సమీకారణాలు మారడంతో సురేశ్ ప్రభును కేబినెట్ లోకి తీసుకోనప్పటికీ.. ప్రపంచ వేదికలైన జీ 7, జీ 20 గ్రూప్స్‌లో భారత్ కు ప్రతినిధిగా సురేష్ ప్రభును ప్రధాని మోదీ నియమించారు. మోదీ-ప్రభుల సాన్నిహిత్యం నేపథ్యంలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులకు లేఖలు రాయడం సంచలనంగా మారింది. చివరిసారిగా సురేశ్ ప్రభు సతీసమేతంగా అమరావతిలోని జగన్ ఇంటికి వచ్చి భోజనం చేశారు. తాజా లేఖ వ్యవహారంపై వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications