టిడిపి-బిజెపిమధ్య పొత్తు: అర్ధరాత్రిదాకా చర్చ, ఇదీ లెక్క

అర్ధరాత్రి దాకా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఎడతెగని చర్చలు జరిపారు. అనంతరం ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తొలిదశ ఎన్నికలకు సమబంధించి ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లువేసేందుకు సిద్ధమవుతున్నారు.
మల్కాజిగిరి ఎవరికి ఇచ్చినా మద్దతు: ఎర్రబెల్లి
మల్కాజ్‌గిరి లోకసభ సీటు ఎవరికి ఇచ్చినా మద్దతు ఇస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
శనివారం ఉదయం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిని వెంటబెట్టుకుని పార్టీ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కృషి చేశారని వారిద్దరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి అన్నారు.












Click it and Unblock the Notifications