ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు - అనూహ్య ఎంపిక..!?
తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ పగ్గాలు కొత్త వారికి అప్పగించేలా కసరత్తు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతలతో హైకమాండ్ ముఖ్యులు అభిప్రాయ సేకరణ చేసారు. ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం జరగనుంది.
బీజేపీ కొత్త సారధి
ఏపీ బీజేపీకి నూతన సారధి రానున్నారు. ఈ మేరకు హైకమాండ్ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర నేతలతో పార్టీ ముఖ్యులు సంప్రదింపులు ప్రారంభించారు. నాయకత్వ మార్పు పైన వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నరు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో సామాజిక సమీకరణాల పైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. ప్రభుత్వం లోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతం పైన నాయకత్వం ఫోకస్ చేసింది.

పార్టీ బలోపేతం దిశగా
తాజా ఎన్నికల్లో బీజేపీ 3 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. నర్సాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. పురందేశ్వరి సేవలు జాతీయ పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఏపీలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాపు, రెడ్డి, బీసీ వర్గాల్లో ఏ వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. బీసీ వర్గానికి మంత్రిగా అవకాశం ఇవ్వటంతో రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే అభిప్రాయం వినిపిస్తోంది.
మాజీ సీఎంకే ఛాన్స్
దీంతో, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో కిరణ్ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసారు. ఏపీ రాజకీయాల పైన పూర్తి పట్టు ఉన్న రాయలసీమకు చెందిన కిరణ్ కు పార్టీ పగ్గాలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందనే నాయకత్వం అంచనా వేస్తోంది. పురందేశ్వరితో పార్టీలో ఒక వర్గం..కొందరు నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందని హైకమాండ్ గుర్తించింది. పార్టీకి ఎంపీలు..ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకొనే ఆలోచనలో పార్టీ ఉంది. దీంతో, త్వరలోనే కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications