చంద్రబాబు కేబినెట్ లో బీజేపీ మంత్రుల ఖరారు..!!

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రంలో మోదీ కేబినెట్ లో ఏపీ నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కింది. ఇక, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఆసక్తి మొదలైంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి అనుగుణంగానే ఏపీలో చంద్రబాబు నిర్ణయాలు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

చంద్రబాబు మంత్రివర్గం
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. 72 మంది మంత్రులతో మోదీ ప్రమాణ స్వీకారం చేసారు. ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కింది. టీడీపీ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. టీడీపీ నాలుగు స్థానాలు ఆశించింది. కానీ, రెండు బెర్తులకే మోదీ పరిమితం చేసారు. జనసేన నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవి దక్కుతుంది అని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా శ్రీనివాస వర్మకు జాక్ పాట్ తగిలింది. ఇదే సమయంలో ఏపీ మంత్రివర్గం పైన బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చలు చేసారు.

BJP to get two berths in Chandra Babu s cabinet names finalised as party sources

బీజేపీతో చర్చలు
ఏపీలో 25 మంది వరకు మంత్రివర్గంలో అకవాశం కల్పించే వెసులుబాటు ఉంది. మిత్రపక్షాలుగా ఉన్న జనసేనకు కేంద్రంలో అవాకశం దక్కకపోవటంతో రాష్ట్రంలో అయిదు మందికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే, మూడు స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. చర్చల్లో భాగంగా మరో స్థానం దక్కే అవకాశం ఉంది. ఇక, బీజేపీ నుంచి ముగ్గురికి అవకాశం ఇవ్వాలని...శాఖల విషయంలో చంద్రబాబుదే నిర్ణయాధికారం ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే..టీడీపీ నుంచి గెలిచిన 135 మందిలో పలువురు సీనియర్లు ఉన్నారు. వారిలో చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

ఆ ఇద్దరికి ఖరారు
దీంతో..చంద్రబాబు తాజాగా మంత్రివర్గ కూర్పులో మోదీ ఫార్ములానే అమలు చేయనున్నారు. 2014లో కేంద్రంలో నాడు మోదీ ప్రభుత్వంలో టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి మంత్రులయ్యారు. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు మంత్రులుగా పని చేసారు. ఇప్పుడు కేంద్రంలో టీడీపీకి రెండు పదవులు ఇచ్చారు. ఏపీలోనూ చంద్రబాబు తన ప్రభుత్వంలో బీజేపీ నుంచి సుజనా చౌదరి, సత్యకుమార్ పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో జమ్మలమడుగు అదినారాయణ రెడ్డి పేరు పైన చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో చంద్రబాబు ఆలోచనల్లో మార్పు జరగకుంటే ఈ ఇద్దరి పేర్లు ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+