గూగుల్ ఆడ్స్ లో మనమే టాప్, ప్రకటనల్లో కోట్లు, టీడీపీ, వైసీపీలు జాతీయ పార్టీలతో పోటి
ఎన్నికలంటే ప్రచారం ,ఆ ప్రచారం లేకపోతే అసలు అభ్యర్థి ఉన్నాడా ,ఉంటే ఏ పార్టీలో ఉన్నాడు ,ఎవరు ,ఏమిటి అనే అంశాలు ప్రజలకు తెలియవు,దీనికి తోడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు సైతం తాము ప్రజలకు చేసిన పనులను తెలియజేయలంటే ప్రచారం ఎంతో అవసరం , ఒక దశలో ప్రచారమే అభ్యర్థులను గెలుపోటములను నిర్ణయించేదశకు చేరుకున్నాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సోషల్ మీడీయా లో ప్రకటన ప్రభావం ఎక్కువగా ఉంటుంది , ఇందులో బాగాంగే దేశంలోనే తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి.

గూగుల్ ప్రకటనల్లో బీజేపి టాప్,
ఈనేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలు ప్రకటనలపై చేసిన ఖర్చుపై గూగుల్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్టు విడుదల చేసింది. కాగా ఫిబ్రవరి 19 నుండి ఇప్పటి వరకు ప్రకటనల కోసం పార్టీలు చేసిన వివరాలను ఇచ్చింది. అయితే ఇందులో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం గూగుల్ ప్రకటనల కోసం రూ.1.21 లక్షల రుపాయాలను ఖర్చు చేసింది. కాగా మొత్తం గూగుల్ ఆడ్స్ బీజేపీ స్థానం పోలిటికల్ ఆడ్స్ స్థానం 32 శాతం ఉంది. అదే జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే గూగుల్ ప్రకటనల కోసం 54,100 రుపాయలను ఖర్చు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ టాప్
కాగా గూగుల్ ప్రకటనల్లో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టాయి. కేంద్ర పార్టీ అయిన బీజేపీ దేశవ్యాప్త ప్రకటనల కోసం 1.21 కోట్లు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అయిన టీడీపీ తమ ప్రకటనల కోసం రెండు ఆడ్ ఏజెన్సీల ద్వార కోటి 48 లక్షల 68 వేల రూపాయాలు ఖర్చు పెట్టింది, కాగా వీటిని పోస్టు చేసిన వాటిలో ప్రమణ్య స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ , నుండి రూ. 85.25 లక్షలు, డిజిటాంట్ కన్సల్టింగ్ లిమిటెట్ నుండి రూ. 63.43 లక్షలను వేర్వేరుగా ఖర్చు పెట్టింది. ఇక ఏపిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ సైతం గూగుల్ లో మొత్తం 107 ప్రకటనలకు గాను 1.04 కోట్ల ను ఖర్ఛు పెట్టింది. మరోవైపు ఏపి లోని మరో వ్యక్తి కూడ 20 వేల రుపాయలను ప్రకటలనల కోసం వెచ్చించారు.

వారం రోజుల్లో గూగుల్ రాజకీయ ప్రకటనల విలువ 3.76 కోట్లు
ప్రతి వారం ఇలాంటీ ప్రకటనలపై నివేదికను విడుదల చేస్తుంది. తాజగా విడుదల చేసిన రిపోర్ట్ ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ చెందిన పార్టీలు అత్యధికంగా 1.73 కోట్లు ఖర్చు పెట్టాయి. అయితే గూగుల్ లాగే టీవీలు, పేపర్లలో సైతం పార్టీల యొక్క ప్రకటల ఖర్చు తెలిపితే ప్రజలకు మరింత ట్రాన్స్‌పరెంట్ ఉంటుందని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications