జగన్ బాత్‌రూం అంత లేదు, సిగ్గేస్తోంది: విష్ణు షాకింగ్ కామెంట్స్, బాబుకు షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అధికార పార్టీపై మరో బాంబు పేల్చారు. ఇప్పటికే విశాఖలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరుగుతోందని ఆయన మంగళవారం ఉదయం అన్నారు.

టిడిపి వచ్చాక 2400 కోట్ల స్కాం, మంత్రులూ.., చంపేస్తానని బెదిరింపు: విష్ణు షాకింగ్

తాజాగా, ఆయన కొత్తగా కట్టిన అసెంబ్లీలో బీజేపీ కార్యాలయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ శాసన సభా పక్ష కార్యాలయం అష్టవంకర్లతో ఉందన్నారు.

BJP Vishnu Kumar Raju shocking comments on AP Assembly.

ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బాత్ రూం అంత కూడా బీజేపీ కార్యాలయం లేదన్నారు. బీజేపీకి మరీ ఇంత చిన్న గది ఇస్తారా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి తమ పార్టీ పెద్దలు వస్తే అసెంబ్లీకి తీసుకు రావాలన్నా సిగ్గేస్తోందన్నారు.

ఆరుగురుకి కలిపి ఒకే బాత్ రూం ఇవ్వడం దారుణమని చెప్పారు. స్కూల్లు, కాలేజీలు కట్టినట్లు అసెంబ్లీని కట్టారని ధ్వజమెత్తారు. తమకు అద్దె గది కేటాయిస్తే మేమే అద్దె కూడా చెల్లిస్తామని విష్ణు కుమార్ రాజు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ అని చెప్పవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP Vishnu Kumar Raju shocking comments on AP Assembly.
Please Wait while comments are loading...