ఏపీలో బిజెపి అధికారంలోకి రావాలనుకుంటోంది, కష్టం: మురళీ మోహన్
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధికారం అంత సులువు కాదని తెలుగుదేశం పార్టీ నేత, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ మంగళవారం నాడు అన్నారు. ఏపీలో సొంతగా అధికారంలోకి వచ్చేందుకు బిజెపి పావులు కదుపుతోందన్నారు.
కానీ బిజెపి అధికారంలోకి రావడం అంత సులువు కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పడం లేదన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టకపోవడం వల్లనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.

కాగా, ఏపీలో సొంతగా అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాపులను దరి చేర్చుకునే ప్రయత్నం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో 2019 నాటికి కీలకంగా ఎదగాలని భావిస్తోంది.
అందుకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నటుడు చిరంజీవిని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు కూడా చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టిడిపి నేత మురళీ మోహన్ వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications