యువతికి అసభ్యకర మెసేజ్‌లు: బిజెవైఎం నేత అరెస్ట్

గత ఏడాది మే ఏడో తేదీన బాధితురాలి చేయి పట్టుకోవడంతో తెనాలి పోలీస్‌స్టేషన్‌కు కేసు నమోదైంది. పోలీసులు వెంకయ్యనాయుడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. బెయిల్‌పై విడుదలైన తరువాత వెంకయ్యనాయుడు వేధిస్తుండడంతో గత ఏడాది అక్టోబర్ 12న బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆ తర్వాత ఆమె కూకట్‌పల్లిలోని పుట్టింటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వెంకయ్యనాయుడు తన మెయిల్ ద్వారా ఆమెకు అసభ్య మెసేజ్‌లతో పాటు ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి పంపాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు తెనాలిలో నిందితుడ్ని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకి తరలించారు.
విశాఖపట్నం: భర్తతో గొడవల కారణంగా ఓ మహిళ తన బిడ్డతో సహా నేల బావిలో దూకింది. ఆమె ప్రాణాలు కోల్పోగా, బిడ్డను స్థానికులు రక్షించారు. కూరగాయలు అమ్ముకునే మోహన్‌బాబు విశాఖ గాజువాక ఆపరేషన్ కాలనీలో ఉంటున్నాడు. మోహన్‌బాబుకు, భార్య కామాక్షి (25)కి గొడవలు అవుతుండేవి. ఆదివారం రాత్రి గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున కామాక్షి ఐదేళ్ల మనోజ్‌తో పాటు ఇంటికి సమీపంలో వున్న బావిలో దూకింది.
మావోయిస్టు అరెస్టు
సీపీఐ మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీ దళ సభ్యుడు గెమ్మెలి కేసు (30)ను అరెస్టు చేసినట్టు విశాఖ జిల్లా జీకే వీధి ఎస్‌ఐ నరసింహమూర్తి సోమవారం తెలిపారు. ఇతనిపై 20 కేసులు ఉన్నాయన్నారు. గెమ్మెలి కేసుపై ప్రభుత్వం మూడేళ్ల క్రితం రూ.లక్ష రివార్డు ప్రకటించిందని ఎస్‌ఐ చెప్పారు.












Click it and Unblock the Notifications