నాకే రాలేదు, ఇక వాళ్లకా: బీకే, పవన్ కళ్యాణ్ పిలిచినా వెళ్లలేదు.. బోండా
తెలుగుదేశం పార్టీ అనే పరిశ్రమలో తాను ముప్పై ఆరు ఏళ్లుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నా, తాను ప్రమోషన్ లేని కార్మికుడినని అనంతపురం జిల్లా, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బీకే పార్థసారథి అన్నారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అనే పరిశ్రమలో తాను ముప్పై ఆరు ఏళ్లుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నా, తాను ప్రమోషన్ లేని కార్మికుడినని అనంతపురం జిల్లా, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బీకే పార్థసారథి అన్నారు.
పార్టీలో మండల స్థాయి అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ చైర్మన్‌గా పని చేశానని చెప్పారు. ప్రస్తుతం ఏడేళ్లుగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నానని తెలిపారు.
మంత్రి పదవికి ఇంత కన్నా అర్హతలు ఏం కావాలన్నారు. తనలా ప్రమోషన్ లేని సీనియర్ కార్మికులు ఎందరో జిల్లాలో ఉన్నారని, తనకే పదవి రాకపోతే ఇంక వారికి ఏమి దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బెజవాడలో ఆదివారం హైడ్రామా!
ఆదివారం మంత్రివర్గ విస్తరణ ముగిసిన కాసేపటికే జిల్లాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధిష్ఠానంపై తిరుగుబాట్లు, కార్యకర్తల సమావేశాలతో అసంతృప్త ఎమ్మెల్యేలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.
జిల్లాలో తలెత్తిన విస్తరణ అసంతృప్తిని చల్లబరిచేందుకు పార్టీ అధిష్ఠాన దూతలు రంగంలోకి దిగారు. అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను బుజ్జగించే యత్నం చేశారు. అయితే దూతలను కూడా బోండా ఉమ ఖాతరు చేయలేదు.
మంత్రి వర్గ విస్తరణ ముహూర్తానికి ముందు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తనకు మంత్రి పదవి దక్కటం లేదని చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తానని నియోజకవర్గ నేతల దగ్గర ప్రస్తావించటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

రాజీనామా హడావుడి
బొండా రాజీనామా చేస్తానని అంటున్నారని వెంటనే నియోజకవర్గ నేతలు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, అర్బన పార్టీ అధ్యక్షులు బుద్దా వెంకన్నల దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు బొండా ఉమా ఇంటికి చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు.
ఏం జరిగిందో తెలియకుండా తొందరపడవద్దని ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ బొండా ను బుజ్జగించారు. నేతల బుజ్జగింపులకు బొండా ససేమిరా అన్నారు. పదమూడేళ్ల పాటు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశానని, పదేళ్ళకు పైగా అధికారంలో లేనపుడు తాను పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని ఎంపీలు, పార్టీ అధ్యక్షుని వద్ద ఆగ్రహంతోనే బొండా ఉమా చెప్పారు.

జగన్ తీరు ఎండగట్టా.. పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన..
ప్రతిపక్ష నేత జగన్ తీరును ఎండగట్టడంలో ముందున్నానని బొండా చెప్పుకొచ్చారు. తనను వాడుకుని వదిలివేయడం బాధించిందన్నారు. జనసేన పార్టీ నుంచి ఆహ్వానం పలికినా పార్టీ మీద ఉన్న నమ్మకంతో కనీస ఆలోచన కూడా చేయలేదని, అయినా పార్టీలో కనీస గుర్తింపు లేకుండా పోయిందని చెప్పారు. ఇంత అవమానం జరిగాక పార్టీలో ఉండి లాభమేమిటని రాజీనామా చేస్తానని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న, ఎంపీలు కేశినేని, కొనకళ్ల బొండా ఉమాను బుజ్జగించినా బొండా తన పంతం వీడలేదు.

కాపుల గొంతు కోశారని చెబుతుంటే.. అడ్డుకున్న కేశినేని
ఇదే సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంకా రాలేదని పార్టీ రాష్ట్ర నాయకుడి నుంచి బొండా ఉమాకు ఫోన్ వచ్చింది. అప్పటికే తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న బొండా ఫోనలోనే ఆ నేతతో కాపుల గొంతు కోశారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని గట్టిగా చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతతో అలా మాట్లాడటం మంచిది కాదని వెంటనే కేశినేని బొండా నోటికి తన చేతిని అడ్డుపెట్టి పరుషంగా మాట్లాడనీయకుండా చేశారు.
బొండా ఉమా నివాసంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటం, ఆయన రాజీనామా చేస్తున్నారన్న సమాచారం రావటంతో వెంటనే నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, పార్టీ డివిజన నాయకులు ఆయన నివాసానికి చేరుకున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉండాలని బొండా వర్గీయులు సూచించటంతో అంతా ఒక్కసారిగా రాజీనామా చేయబోతున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ హైడ్రామా కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది.

సీఎంతో మాట్లాడాక.. 1 రోజుల్లో పదవి..
కేశినేని, కొనకళ్ల తదితరులతో కలిసి బొండా సీఎం నివాసానికి వెళ్ళారు. ఈ చర్యలపై సీఎం సీరియస్ అయినట్టు చానల్స్‌లో ప్రచారం జరిగింది. సీఎంతో మాట్లాడి వచ్చిన తర్వాత బొండా మాట్లాడుతూ.. రాజీనామా చేయబోవటం లేదని, తగిన న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పి వెళ్ళిపోయారు.
ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడినందుకు బొండాను అభినందించారని, రాజకీయ ఎత్తుగడలు, కుల సమీకరణాల నేపథ్యంలో, మంత్రి పదవి ఇవ్వటం కుదరలేదని సర్దిచెప్పారని, 10 రోజుల్లో బొండా ఉమాకు మంచి పదవి ఇస్తామని చెప్పారని కేశినేని నాని చెప్పారు.
కాగితపు అసంతృప్తి
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాగిత వెంకటరావుకు మంత్రి పదవి దక్కకపోవటంతో పెడన నియోజకవర్గాన్ని అసంతృప్తి కలిగించింది. వందలాది మంది కార్యకర్తలు వెంకటరావు ఇంటికి చేరుకున్నారు. పార్టీలో ఉన్న నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేయటానికి సిద్ధపడ్డారు. వెంకటరావు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోనలో మాట్లాడారు.
తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా.. నేను బాధ పడనని, కానీ, రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఉన్నారని, వారిలో ఒక్కరికి ఇచ్చినా బాగుండేదని, శెట్టి బలిజలలో ఇద్దరికి రెండు పదవులు ఇచ్చారని, ఇది న్యాయమేనా అని కాగిత పార్టీ నాయకులను ప్రశ్నించారు. అయితే, మంగళవారం చంద్రబాబు మీతో మాట్లాడుతారని, సీనియర్ మీరు.. అలా మాట్లాడవద్దని చల్లబరిచారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications