అలా విడిపిస్తున్నారు: నల్లధనం మార్చుకునేందుకు మరో కొత్త 'ఐడియా'!
పాత నోట్లు మార్చుకునేందుకు రోజుకో సరికొత్త ఐడియా పుట్టుకు వస్తోంది. ఇతరుల బ్యాంకుల ఖాతాలలో వేయడం, బంగారం కొనడం, ఆ తర్వాత డాలర్లుగా మార్చుకున్నారు.
హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మార్చుకునేందుకు రోజుకో సరికొత్త ఐడియా పుట్టుకు వస్తోంది. ఇతరుల బ్యాంకుల ఖాతాలలో వేయడం, బంగారం కొనడం, ఆ తర్వాత డాలర్లుగా మార్చుకోవడం.. ఇలా కొత్త కొత్త ఐడియాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పుడు పాత పద్ధతి వైపు దృష్టి మరలింది. బంగారం, భూముల పైన నల్ల డబ్బు పెట్టుబడికి దారులు వెతుకుతున్నారు. బంగారం దుకాణాల్లో లెక్కల్లో చూపని బంగారం బిస్కెట్లను పాత నోట్లతో కొనుగోలు చేస్తున్నారు. రూ.100 గ్రాముల బంగారం బిస్కెట్లు గురువారం నాటి మార్కెట్‌లో రూ.3.15 లక్షలు ఉండగా, అంతకు ఎక్కువ ఇచ్చి చలామణిలో ఉన్న నోట్లను తీసుకుంటున్నారు.

అంతేకాదు, బ్యాంకుల తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు పెద్ద నోట్లు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం, ఇంటి ఖర్చుల కోసం బ్యాంకులలో తనకా పెట్టిన ఆభరణాలను విడిపించే కారణంతో రూ.500, రూ.1000 నోట్లను వినియోగిస్తున్నారని అంటున్నారు. అయితే వీరితో నల్ల ధనం కలిగి ఉన్న వారు అలా చేయిస్తున్నారని అంటున్నారు.
గత ఐదు రోజులుగా బ్యాంకు తాకట్టులో ఉన్న బంగారం వస్తువులను విడిపిస్తున్నారని తెలుస్తోంది. తెలిసిన వారివి, బంధువుల నగలను బ్యాంకుల నుంచి విడిపించేలా ఏర్పాట్లు చేశారని అంటున్నారు. కాగా, పెద్ద నోట్లు మార్చేందుకు మధ్యవర్తులు పెద్ద మొత్తంలో కమిషన్ కూడా తీసుకుంటున్నారని అంటున్నారు.
-
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications