భారీ పేలుడు: తెగిపడ్డ చేయి, ఇద్దరు చిన్నారులకు గాయాలు

హైదరాబాద్: విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని రఘవర్మ అనే వ్యక్తి చేయి తెగి పడింది.

Blast in a house ibrahimpatnam near vijayawada, 2 persons injured

ఈ ప్రమాదంలో రఘవర్మతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలోని సుందరయ్య నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+