పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం
రక్తదానం ప్రాణదానంతో సమానమని, తన పెళ్లి సందర్భంగా సమాజాకికి ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకున్నట్లు సూర్యతేజ్ తెలిపారు.
నంద్యాలలో ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరుడు సూర్య తేజ్ మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని ,రక్తం సమయానికి అందక ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆపదలో ఉన్నవారికి రక్తం అందించాలనే ఉద్దేశంతోనే రిసెప్షన్ ఫంక్షన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నూతన వరుడు సూర్యదేజ్ పెళ్లి బట్టల్లోనే రక్తదానాన్ని చేశారు.
రిసెప్షన్ కి హాజరైన అతిధులందరూ వరుడు పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నో ప్రమాదాల్లో సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయినవారిని తాను చూశానని, తన పెళ్లికి సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా పని చేయాలనుకున్నానని, చివరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సూర్యతేజ్ వెల్లడించారు. వివాహానికి వచ్చిన చాలామంది తమ రక్తం దానం చేయడంతో స్థానిక బ్లడ్ బ్యాంక్ లో వీటిని నిల్వపరిచారు. అత్యసవర సమయాల్లో ప్రమాదానికి గురైనవారికి వీటిని ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి ఎప్పుడంటే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరుకు 60 గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే రక్తం ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి వ్యక్తి ప్రాణాన్ని వైద్యులు రక్షిస్తారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడా కొంత రక్త స్రావం జరుగుతుంది.
నంద్యాల జిల్లా: తన పెళ్లి రిసెప్షన్లో రక్తదానం చేసిన పెళ్లి కొడుకు సూర్య తేజ్ pic.twitter.com/kmGRUX2wBH
— oneindiatelugu (@oneindiatelugu) February 14, 2023
అరలీటరు రక్తాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు. మన శరీరంలో 12 యూనిట్ల రక్తం ఉంటుంది. ఒక్కోసారి రోగిశరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదాలకు గురైన సమయంలోను బాధితులకు అత్యవసరంగా రక్తం అందడంలేదు. ప్రమాదానికి గురైనవారు ప్రాణాలు కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణమవుతుంది.












Click it and Unblock the Notifications