బోటు ప్రమాదం: పబ్లిసిటీ పిచ్చి, అఖిలప్రియను టార్గెట్ చేసిన జగన్ పార్టీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బోటు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సోమవారం వైసీపీ నాయకులు పార్థసారథి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జోగి రమేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించారు.

Krishna River Boat Incident : Ex-Gratia Announced Video | Oneindia Telugu

ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియను వారు టార్గెట్ చేశారు. అంతేకాదు, హోంశాఖ, ఇరిగేషన్ శాఖల మంత్రులను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

ప్రమాదంపై జగన్, మీకు చేతకాకుంటే మేమొచ్చాం: ఊగిపోయిన వైసిపి నేత, తొలుత స్పందించింది వారే

అఖిలప్రియ సహా వారిని బర్తరఫ్ చేయాలి

అఖిలప్రియ సహా వారిని బర్తరఫ్ చేయాలి

బోటు బోల్తా పడి ఇరవై మంది చనిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన హోం, ఇరిగేషన్, పర్యాటక శాఖల మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు

ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు

ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. నదిలోకి వెళ్లేందుకు బోటుకు అనుమది లేదని, అలాంటప్పుడు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. లైఫ్ జాకెట్లు కూడా లేకుండా ఎలాఅని నిలదీశారు. అన్నింటికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

మరీ ఘోరమైన విషయం ఏమంటే

మరీ ఘోరమైన విషయం ఏమంటే

మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాఫ్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. మరో ఘోరమైన విషయం ఏమంటే, కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదన్నారు. లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా 38 మంది ప్రయాణీకులను ఎలా బోటు ఎక్కించారని ప్రశ్నించారు.

రూట్ క్లియర్‌గా లేదు

రూట్ క్లియర్‌గా లేదు

రూట్ మ్యాప్ క్లియర్‌గా లేకపోవడం, కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్లే ప్రమాదం జరిగిందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. బోటుకు లైసెన్స్ కూడా లేదన్నారు. ఈ ప్రమాదంలో ఒంగోలువాసులు ఎక్కువగా చనిపోయారన్నారు.

అప్పుడు ముప్పై మందిని, ఇప్పుడు ఇరవై మందిని

అప్పుడు ముప్పై మందిని, ఇప్పుడు ఇరవై మందిని

బాధితులను పరామర్శించేందుకు తాము అర్ధరాత్రే ఇక్కడకు వచ్చామని, అప్పటికి ప్రమాద స్థలంలో ఎవరూ లేరని మండిపడ్డారు. ఈ ప్రమాదాన్ని చిన్న విషయంగా చూపించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటామన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని, ఇప్పుడు 20 మందిని బలి తీసుకున్నారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party on Monday targetted Minister Akhila Priya on Boat capsized.
Please Wait while comments are loading...