చంద్రబాబు ఇష్టం, నా కొడుక్కి కిరీటం పెట్టరుగా: బొజ్జల, బోండాకు బాబు ఝలక్
తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కన్నా తన ఆరోగ్యం ముఖ్యమని చంద్రబాబు చెప్పారని, అందుకే తనను తొలగించినట్లు తెలిపారు.
అమరావతి: తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కన్నా తన ఆరోగ్యం ముఖ్యమని చంద్రబాబు చెప్పారని, అందుకే తనను తొలగించినట్లు తెలిపారు.
మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టమని చెప్పారు. ఇష్టం ఉన్నా లేకున్నా తాను చేసేది ఏదీ లేదని చెప్పారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. తన వారసుడైతే ప్రజలు కిరీటం పెట్టరని, ప్రజల నుంచి రావాలన్నారు.

తొలిసారే మంత్రి పదవి అడగటం భావ్యమా?: బోండాతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అడగటం భావ్యమా? అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన బొండా ఉమాను ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ బుజ్జగించి ఆదివారం సీఎం వద్దకు తీసుకెళ్లారు. కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యతను బొండాకు వివరించిన సీఎం చంద్రబాబు.. ఆ సామాజికవర్గం నుంచి అయిదుగురికి మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు.












Click it and Unblock the Notifications