అలకవీడి చంద్రబాబును కలిసిన బొజ్జలగోపాలకృష్ణారెడ్డి

మంత్రి పదవి నుండి ఉద్వాసనకు గురైన చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి తన కొడుకు సుధీర్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకొన్నార

అమరావతి:మంత్రి పదవి నుండి ఉద్వాసనకు గురైన చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి తన కొడుకు సుధీర్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకొన్నారు.

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ కారణంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రివర్గం నుండి తప్పించారు. ఆనారోగ్య కారణాలను చూపుతూ ఆయనను మంత్రివర్గం నుండి తప్పించారు.

Bojjala Gopalakrishna Reddy met Chandrababu

అయితే మంత్రివర్గం నుండి తప్పించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. అయితే పార్టీ నాయకులు ఆయనకు సర్ధిచెప్పడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకొన్నారు. మంత్రివర్గంలో చోటుకోల్పోయిన తర్వాత ఆయన చంద్రబాబును కలువలేదు.

అయితే తనను కలవాలని బాబు బొజ్జలను కోరారు. ఇటీవలనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పుట్టినరోజు జరుపుకొన్నారు. పుట్టినరోజున బాబు ఆయనకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన తర్వాత బాబును అమరావతికి వెళ్ళి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెళ్ళి కలిశాడు. తన కుమారుడు సుధీర్ ను కలిసి ఆయన బాబును కలిశారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకొన్నారు. ఆయన చికిత్స కోసం తీసుకొంటున్న చికిత్స వివరాలను కూడ ఆయన తెలుసుకొన్నారు.

నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల గురించి సుధీర్ ను అడిగి తెలుసుకొన్నారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు బొజ్జల. ఇటీవల సీఎంను కలవకపోవడంతో ఒకసారి కలుద్దామని వచ్చానని బొజ్జల చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+