హోదాపై బాబు అలా అన్లేదు: బోండా ట్విస్ట్, 'విజయసాయి నేరపూరిత చర్య', జగన్‌కు షాక్!
Recommended Video

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు శుక్రవారం మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు హయాంలో అధికారులు జాతీయ అవార్డులు గెలుచుకున్నారని చెప్పారు. ఐఏఎస్‌లపై విజయ సాయి రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

బాబు మాట మార్చలేదు
ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నారన్న ఆరోపణలపై బోండా ఉమ స్పందించారు. ప్రత్యేక హోదా వద్దు అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన వాటినే తాము అడుగుతున్నామని చెప్పారు.

ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు
ఆనాడు అరుణ్ జైట్లీ ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని బోండా ఉమ మండిపడ్డారు. హామీలను నెరవేర్చమంటే తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు కేంద్రంపై పోరాడాలని సూచించారు.

చట్టపరమైన చర్యలు
జగన్, విజయ సాయి రెడ్డిలపై ఉన్న కేసుల విచారణ వేగం అవుతున్నందునే వారు అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడులు ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినేలా తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్ క్షమాపణ చెప్పాలి
జగన్, విజయ సాయి రెడ్డిల పైన కేసు నమోదుకు కూడా ప్రభుత్వం వెనుకాడదని మంత్రులు హెచ్చరించారు. సీఎంవో అధికారులు, నిఘా విభాగం అధికారులపై విజయ సాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అది నేరపూరిత చర్య కిందకు వస్తుంది
జగన్, విజయ సాయి రెడ్డిల గ్యాంగ్ నేర చరిత్ర ప్రపంచం మొత్తం మార్మోగిపోయిందని మంత్రులు మండిపడ్డారు. తమ మోసాలు ఎక్కడ రుజువు అవుతాయోననే భయంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. బెదిరింపు రాజకీయాలకు తెరలేపడం దారుణం అన్నారు. ఉద్యోగుల విధి నిర్వహణకు అడ్డుపడినా, బెదిరించినా అది నేరపూరిత చర్య కిందకు వస్తుందన్నారు.

ఇదీ వైసీపీ నేతల నేరచర్య
గతంలో జగన్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు విమానాశ్రయంలో సిబ్బంది పైన ఇదే తరహాలో దౌర్జన్యాలకు దిగారని మంత్రులు మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడే వీరి పరిస్థితి ఇలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నేరాలకు పాల్పడ్డారో అర్థణవుతోందని ధ్వజమెత్తారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications