బెజవాడలో అగ్గిరాజేసిన గణేష్ ఉత్సవం: లైవ్‌లో తిట్టుకున్న బొండా ఉమ, కోగంటి సత్యం

అమరావతి: డుండీ గణేష్ ఉత్సవ్ సేవా సమితిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో డుండీ గణేష్ సేవా సమితి రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గానికి గౌరవ అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉండగా, మరో వర్గానికి గౌరవ అధ్యక్షుడిగా పారిశ్రామికి వేత్త కోగంటి సత్యం ఉన్నారు.

ఈ క్రమంలో బొండా ఉమ, కోగంటి సత్యంల మధ్య రాజుకున్న వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో గతేడాది నిర్వహించిన డుండీ గణేష్ ఉత్సవాల్లో అవకతవకలు జరిగాయంటూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీనిపై బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ డుండీ గణేష్ సేవా సమితికి రిజిస్టర్డ్ బాడీని ఏర్పాటు చేశామని, వారు మాత్రమే ఉత్సవ నిర్వాహకులని అన్నారు.

తనని కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. ఎవరు పడితే వారు కమిటీ అధ్యక్షులు అంటే కుదరని అన్నారు. కావాలనే కొంత మంది డుండీ గణేష్ ఉత్సవాలకు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. వారంతా సహకరించాలని కోరారు. ప్రజల నుంచి ప్రతి పైసా కూడా తీసుకోకుండా ఉత్సవాలను జరిపిస్తామని అన్నారు.

Bonda Uma Vs Koganti Satyam on Dundi Ganesh Utsav in Vijayawada

ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓ టీవీ ఛానెల్‌ లైవ్‌లో బొండా ఉమా, కోగంటి సత్యంల మధ్య ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది.

బోండా ఉమ: నువ్వు (కోగంటి సత్యం) ఎన్నిసార్లు జైలు కెళ్లావో చెప్పాలి
కోగంటి సత్యం: నా మీద ఒకే ఒక్క కేసు ఉంది... ఆ కేసు కూడా ఎందుకు ఉందంటే... నీ మీదున్న రౌడీ షీట్ ను అప్పటి సీఐ రామారావు కాళ్లు పట్టుకుని నువ్వు తీయించుకున్నావు. నేను అతని కాళ్లు పట్టుకోలేదు. దీంతో నా పైన కేసుంది, లేకపోతే ఆ కేసు కూడా ఉండేది కాదు.
ఉమ: నువ్వు రౌడీవని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి... నీపై మర్డర్ కేసులున్నాయి
సత్యం: నువ్వు నా కుర్రాడివా? కాదా? అది ముందు చెప్పు
ఉమ: నేను నీ దగ్గర పని చేశానా? నువ్వు నా దగ్గర గుమస్తాగా పని చేశావా?
సత్యం: ఎవరు ఎవరి దగ్గర పని చేశారో విజయవాడలో అందరికీ తెలుసు... నేను నీ దగ్గర పని చేశానా?... నా పేరు చెప్పుకుని నువ్వు ఎన్నో సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకున్నది నిజం కాదా?
ఉమ: దేవుడి కార్యక్రమంలో రాజకీయాలకు తావులేదు... వారు వారు చేసుకుంటే వివాదం ఏముంది?
సత్యం: ప్రజా ప్రతినిధిగా నువ్వు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి... అలా కాకుండా నువ్వు మధ్యలో కల్పించుకుంటే ఎలా?
ఉమ: ఇందులో రాజకీయం లేదా? నీ జీవితం గురించి నాకు చెప్పకు... నీ గురించి నాకు తెలియనివి ఉన్నాయా?
సత్యం: నేను షోడాలు అమ్ముకుని జీవితంలో పైకి వచ్చాను... నువ్వు నాలాంటోళ్ల దగ్గర పని చేసి ఎదిగావు
ఉమ: ఇప్పటికైనా మారు... రౌడీయిజం మానెయ్... నా నియోజకవర్గంలో రౌడీయిజానికి తావు లేదు
సత్యం: నువ్వు రాజకీయ రౌడీవయ్యావు... నన్ను రౌడీ అంటావా?
ఉమ: నేను 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాను
సత్యం: అది నీ గొప్పతనం కాదు... చంద్రబాబు వల్ల నీకు లభించింది... అలా కాదు, నీ సత్తాతో గెలిచానని అనుకుంటే... ఇప్పుడు నీ పదవికి రాజీనామా చేసిరా... ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం... ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+