పవన్ బర్త్ డేకి టీడీపీ నేత యాడ్: అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే తెలుగు టీవీ న్యూస్ ఛానెళ్లలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వస్తున్న ఓ యాడ్ ఆసక్తిని రేపుతోంది.

జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ యాడ్‌ని తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణాజిల్లా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు జారీ చేశారు. ఈ యాడ్‌లో బొండా ఉమమహేశ్వరరావు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Bonda Umamaheswara Rao advertisement on pawan kalyan birthday

దీంతో పాటు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేనాధిపతి సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాలని ఆ యాడ్‌లో అభిలషించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫొటోలతో పాటు బోండా ఉమా ఫొటో ఉన్న ఆ యాడ్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం కూటమికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దుతిచ్చి, ఎన్నికల్లో ఆ పార్టీల తరుపున ప్రచారం చేశారు. బీజేపీ-టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమికను పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+