ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ హైర్ బస్సులు: కిలో మీటర్ చొప్పున టారిఫ్ వెల్లడి

రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా అయ్యప్ప స్వామి భక్తుల సందడి నెలకొంటోంది. మండల పూజ, జ్యోతి దర్శనానికి మాలధారణ చేస్తోన్నారు. హరిహరసుతుడి పాటలతో పండగ వాతావరణం ఏర్పడుతోంది. మండల పూజ కోసం శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయం నవంబర్ 16న సాయంత్రం 5 గంటలకు తెరచుకోనుంది. ఆ మరుసటి రోజు నుంచి అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. మండలపూజ డిసెంబర్ 27వ తేదీన ముగుస్తుంది.

అయ్యప్ప స్వామి కృపాకటాక్షాల కోసం భక్తులు ఆచరించే ఈ 41 రోజుల కఠినోపవాస దీక్షకు ఈ మండల పూజ ముగింపు ఘట్టంగా నిలుస్తుంది. క్రమశిక్షణ, విశ్వాసం, కఠిన నియమాలు, నిస్వార్థ భక్తి ప్రపత్తుల సమాహారంగా సాగే ఈ కాలం అంతా కూడా శబరిమల గిరులన్నీ అయ్యప్ప శరణుఘోషతో మార్మోగుతాయి. మాలధారణ చేసిన లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

Book APSRTC Buses on Hire for Sabarimala Pilgrims Special Tariff Choose Amaravati AC and Starliner

శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక రవాణా సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. అద్దె ప్రాతిపదికన బస్సులను ప్రవేశపెట్టింది. కిలోమీటర్ ప్రాతిపదికన అద్దె టారిఫ్ వివరాలను వెల్లడించింది. కనీసం అయిదు రోజుల వ్యవధితో ప్రత్యేక బస్సులను బుక్ చేసుకునే గురుస్వామి లేదా ఏజెంట్లకు రూ. 2,000 కమిషన్ కూడా అందజేయనున్నట్లు తెలిపింది.

అన్నింటికీ తయ్యార్: సెక్షన్ 163 విధింపు: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత
అన్నింటికీ తయ్యార్: సెక్షన్ 163 విధింపు: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత

దీనితో పాటు యాత్రలో వంట చేసుకోవడానికి వీలుగా వంటమనుషులు, మణికంఠులు, సహాయకులు సహా ఏడుమంది ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అమరావతి ఏసీ మొదలుకుని పల్లెవెలుగు వరకు శబరిమల యాత్రలో భక్తుల అవసరాలు, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల బస్సులను ఈ ప్యాకేజీ పరిధిలో ఉన్నాయి. ప్రయాణ దూరం, రోడ్డు మార్గానికి అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

కొరుకుడు పడని కొరియాకు ఫైనల్ లో చుక్కలు చూపిన భారత్.. !!
కొరుకుడు పడని కొరియాకు ఫైనల్ లో చుక్కలు చూపిన భారత్.. !!

మొత్తం తొమ్మిది రకాల బస్సులు ఇందులో ఉన్నాయి. ఈ స్పెషల్ హైర్ ప్యాకేజీ ప్రకారం.. అమరావతి ఏసీ బస్సులో ఒక కిలోమీటర్ కు రూ. 120 చొప్పున వసూలు చేస్తారు. ఇంద్ర ఏసీ బస్సులో ఈ మొత్తం రూ. 79 గా ఖరారు చేశారు. స్టార్ లైనర్- రూ. 66, సూపర్ లగ్జరీ- రూ. 57, అల్ట్రా డీలక్స్- రూ. 61, ఎక్స్‌ప్రెస్- రూ. 62, సప్తగిరి ఎక్స్‌ప్రెస్- రూ. 62, అల్ట్రా పల్లెవెలుగు- రూ. 62, పల్లెవెలుగు- రూ. 52 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ బస్సులో అత్యాధునిక ఆడియో, వీడియో వసతులు అందుబాటులో ఉంటాయి.

శబరిమల చేరుకునే మార్గంలో ఘాట్ రోడ్లు ప్రమాదకరమైన మలుపులతో కూడి ఉంటాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ ప్రత్యేక రవాణా సేవలను వినియోగించుకోవాలనుకునే అయ్యప్ప భక్తులు డిపో అధికారులను సంప్రదించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+