రన్నింగ్ ట్రైన్ లో సులువుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు!
వెయిటింగ్ లిస్టు టికెట్ తో రైలులో ప్రయాణం చేసేటప్పుడు సీటు పొందాలనుకుంటే నిముషాల వ్యవధిలోనే పొందవచ్చు. ఖాళీ సీటు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. రైల్వే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ఏ కోచ్ ఖాళీగా ఉంది?.. ఏ బెర్త్ ఖాళీగా ఉంది? అనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. వెంటనే టీటీఈ ద్వారా మీపేరుపై రిజర్వు చేసుకోవచ్చు. ఇది చాలా సులువు
irctc వెబ్ సైట్ హోమ్ పేజీలో బుక్ టిక్కెట్ల ట్యాబ్‌ను క్లిక్ చేసి అందులో PNR స్టేట స్ చూడాలి. చార్ట్ లో ఖాళీ అని ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజర్వేషన్ ఛార్ట్, ప్రయాణ వివరాలతో ఒక ట్యాబ్ ఓపెనవుతుంది. అందులో మీ రైలు నెంబర్, స్టేషన్, ప్రయాణ తేదీతో పాటు బోర్డింగ్ స్టేషన్ పేరు నమోదు చేసి ఏ తరగతి, కోచ్ ద్వారా బెర్త్ ను పొందొచ్చు.

ఏ కోచ్‌లో ఏయే సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలిపే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఇలా చేయడంద్వారా రైలులో ఖాళీగా ఉన్న సీటును కనుగొని దాన్ని బుక్ చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై ప్రయాణిస్తుంటే, సీటు కోసం టీటీఈకి అప్పీల్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల వారికి బెర్త్ లభించడానికి చాలా సమయం పట్టేది.
కొన్నిసార్లు సీట్ల కేటాయింపులో గందరగోళ పరిస్థితి తెలెత్తేది. ఈ సమస్యను పరిష్కరించడానికి భారతీయ రైల్వే తాజాగా ఆన్‌లైన్‌లో సీట్ల లభ్యత డేటాను చూపిస్తోంది. దీంతో ప్రయాణికులు బెర్తుల లభ్యత గురించి పూర్తి సమాచారం తెలుసుకుని ఖాళీగా ఉన్న బెర్త్ లను పొందవచ్చు. https://www.irctc.co.in/online-charts/ క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే సైట్ లోకి లాగిన్ కావాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications