వాళ్లు కష్టపడుతున్నారు.. ! వీళ్లు కష్టపెడుతున్నారు..! ఏపీలో మరో సర్వే లీక్..!
ఏపీలో గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్ధితి ఎలా ఉంది, ప్రజా ప్రతినిధులపై జనం ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలనపై ఫీడ్ బ్యాక్ ఏంటన్న అంశాలపై సర్వేలపై సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేకే సర్వేలో పలు అంశాలపై విశ్లేషణలు వస్తుండగా.. త్వరలో విడుదల కానున్న మరో సర్వేపై హింట్ వచ్చేసింది.
రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు కూటమి కచ్చితంగా గెలిచి తీరుతుందని పలు సర్వేలు, విశ్లేషణలు చేసిన సర్వేయర్ ప్రవీణ్ పుల్లట మరోసారి హింట్ ఇచ్చారు. త్వరలో తాను విడుదల చేయబోయే సర్వేకు ముందు వరుసగా హింట్లు, అలర్ట్ లు ఇస్తున్న ఆయన.. ఇవాళ అలాంటిదే మరో హింట్ ఇచ్చారు. ఇందులో తాను చేస్తున్న సర్వే ఫలితం స్ధూలంగా ఎలా ఉండబోతోందో ఆయన రెండు ముక్కల్లోనే చెప్పేశారు.

ఇవాళ ప్రవీణ్ పుల్లట తాను చేసిన ట్వీట్ లో ప్రభుత్వ పెద్దలు కష్టబడుతున్నారు..మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీలు కష్టపెడుతున్నారు.. అంటూ రెండు ముక్కల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పేశారు. ఇదే ఏపీలో అత్యధిక ప్రజా మనోగతం.. అంటూ ఆయన వెల్లడించారు. అలాగే ప్రాంతాల వారీగా జాతకాలు రెడీ అవుతున్నాయంటూ మరో లీక్ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు.

ప్రభుత్వ పెద్దలు కష్టబడుతున్నారు..
— Praveen Pullata (@praveenpullata) June 6, 2025
మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీలు
కష్టపెడుతున్నారు..
ఇదే ఏపీలో అత్యధిక ప్రజా మనోగతం.. ప్రాంతాల వారీగా జాతకాలు రెడీ అవుతున్నాయి.. Pls Stay for detailed report @naralokesh @ncbn @PawanKalyan
ప్రవీణ్ పుల్లట చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు కష్టపడుతున్నారని, కానీ ఆ కష్టాన్ని మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు వృథా చేస్తూ జనాన్ని కష్టాల పాలు చేస్తున్నారని చెబుతున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో విడుదల చేయబోయే సర్వే అంటూ గతంలోనూ పలు ట్వీట్లు చేసిన ప్రవీణ్.. ఇప్పుడు మరోసారి త్వరలో అంటూ చెప్పడం చూస్తుంటే ఇలా వరుసగా ఎన్ని ట్వీట్లు చేశాక ఆ సర్వే విడుదల చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications