అడిగితే బొత్స, జయప్రదలకి కోపమొచ్చింది, మైక్ నెట్టేసి
హైదరాబాద్/లక్నో: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, ఆర్ఎల్డీ బిజ్నోర్ లోకసభ అభ్యర్థి జయప్రదకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీడియా అడిగిన ప్రశ్నకు బొత్స హైదరాబాదులో అసహనం వ్యక్తం చేయగా.. జయప్రద ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బొత్స మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. మైకులను నెట్టి వేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చిన ఆయనను ఒక్కసారే చుట్టుముట్టిన మీడియా వారు.. పార్టీ మారుతారా? అని బొత్సను ప్రశ్నించారు.

అందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ఒక్కసారి మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాగా, బొత్స కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరేందుకు ఇటీవల సీనియర్ నేత వెంకయ్య నాయుడుని కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని గురువారం వెంకయ్య, బొత్స ఖండించారు.
మరోవైపు, జయప్రద ప్రచారానికి ప్రజల నుండి స్పందన రావడం లేదని, దీంతో ఆమె డబ్బులిచ్చి వాలెంటీర్లను పెట్టుకొని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిని మీడియా ప్రశ్నిస్తే ఆమె మండిపడ్డారు. తాను ఎలాంటి వాలెంటీర్లను పెట్టుకోలేదని, కార్యకర్తలు ప్రచారానికి తరలి వస్తున్నారని చెప్పారు.
వాలెంటీర్లను పెట్టుకొని ప్రచారం చేస్తున్నారనేది అవాస్తవమన్నారు. తనతో ఇంతమంది ఉన్నారని, డబ్బులు ఇస్తే వస్తున్నారనడం ద్వారా వారిని అవమానించినట్లే అన్నారు. తన పైన కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications