జగన్‌కు దానర్థం తెలుసా, టిపై టైం సరిపోదు కానీ: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం మండిపడ్డారు. విభజనకు తాము అనుకూలమని, తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు ఎలా కలుస్తారని బొత్స ప్రశ్నించారు.

టిడిపి ద్వంద్వ వైఖరి అందరికీ అర్థమవుతోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని బర్తరఫ్ చేయాలని గతంలో చెప్పి ఇప్పుడు అదే పార్టీతో కలవడం విడ్డూరమన్నారు. వైయస్ జగన్‌కు డిఎన్ఏ అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. జగన్ చిన్నా, పెద్దా తేడా లేకుండా మాట్లాడటం ఏమాత్రం సరికాదన్నారు. స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

నలభై రోజుల సమయం సరిపోదు కానీ

అసెంబ్లీలో విభజన బిల్లు పైన ప్రక్రియకు 40 రోజుల సమయం సరిపోదని చెప్పారు. అయితే, రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరింత సమయం కోరితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శాసన సభా వ్యవహారాల పైన ఎపి కాంగ్రెసు పార్టీ పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తప్పుగా మాట్లాడలేదన్నారు. డిగ్గీ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అర్థరహితమన్నారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందన్నారు.

డిగ్గీపై ఫిర్యాదు సరికాదు: విహెచ్

డిగ్గీ పైన సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు సభాపతికి ఫిర్యాదు చేయడం తగదని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. కాంగ్రెసు నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటిస్తే ఎందుకు మాట్లాడలేదన్నారు.

అందరూ అబద్దాలు ఆడుతున్నారని జగన్ అనడం సరికాదని, సీమాంధ్ర ప్రజలు అమాయకులు కాదని, వారు నాయకుల తీరును గమనిస్తున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చివరి దశకు చేరుకున్నా అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+