బహిష్కరణ, మొదట మిమ్మల్నే పంపాలి: బొత్సVsజెసి

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డిని కాంగ్రెసు నుండి బహిష్కరించాలని తాను ఏఐసిసికి లేఖ రాశానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన జెసి వ్యాఖ్యలు చేయడం అహంకారపూరితమన్నారు. ఆయన కావాలనుకుంటే ఇతర పార్టీలలోకి వెళ్లవచ్చునని సూచించారు. కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని ఎవరూ కాళ్లు పట్టుకొని ఆయనను ఆపడం లేదన్నారు. సోనియాను విమర్శిస్తే పెద్ద వ్యక్తిని అవుతానని ఎవరైనా భావిస్తే అది పొరపాటు అన్నారు. జెసి ఫ్యూడలిస్టులా వ్యవహరిస్తున్నారని, ఆయనకు వేరే ఆలోచన ఉందన్నారు.

Botsa Satyanarayana and JC Diwakar Reddy

అహంకారపూరిత మాటలు మాట్లాడవద్దని సూచించారు. సొంత పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు వందల సంవత్సరాలు బతికినా అధికారంలోకి రాలేరన్నారు. విభజనకు సహకరిస్తున్న బిజెపిని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో సమైక్యాంధ్ర పైన మాట్లాడటం లేదన్నారు. విధానాలను వ్యతిరేకించవచ్చునని, వ్యక్తిగత అజెండాతో మాట్లాడవద్దన్నారు. కిరణ్ ఆవేదనతోనే మాట్లాడుతున్నారన్నారు.

ధీటుగా జెసి

కాంగ్రెసు పార్టీ నుండి తొలగించాల్సి వస్తే ముందు బొత్స సత్యనారాయణనే తొలగించాల్సి ఉంటుందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏఐసిసికి లేఖ రాయడంపై ఆయన స్పందించారు. విభజన సమ్మతం కాదంటూ సిడబ్ల్యూసి తీర్మానాన్ని వ్యతిరేకించిన వారిలో బొత్స కూడా ఉన్నారన్నారు. తీర్మానంపై బొత్స చేసిన సంతకం మాటేమిటని ప్రశ్నించారు. మరోవైపు న్యూఢిల్లీలో దిగ్విజయ్ మాట్లాడుతూ.. జెసి దివాకర్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటున్నానన్నారు.

ఎపిలో కాంగ్రెసు పార్టీ చచ్చిపోయిందన్నారు. ఇక బతకలేదన్నారు. తాను సోనియాను ఎక్కడా కించపర్చలేదని, అనారోగ్యం కారణంగా తప్పుకోవాలని సూచించానన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాలు ఛిన్నాభిన్నం అవుతుందనే తమ ఆందోళన అని, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ రాష్ట్రంలో వస్తుందన్నారు.

కాగా, నాలుగు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో సోనియా గాంధీ రాజీనామా చేసి పార్టీ పగ్గాలు వేరే వారికి అప్పగించే విషయమై ఆలోచించాలని జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+