రెబల్‌కి బొత్స,కొండ్రు వార్నింగ్: క్రిమినల్ చర్య..టిజి ట్విస్ట్

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ రెబల్ అభ్యర్థులకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళిలు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఎమ్మెల్సీ చైతన్య రాజు సమైక్యాంధ్ర అభ్యర్థిని అంటూ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పలువురు మద్దతిచ్చారు. దీనిపై బొత్స, కొండ్రుతో పాటు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్య రాజుకు మద్దతిచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందేనని బొత్స స్పష్టం చేశారు. ఎవరైనా చైతన్యరాజుకు మద్దతిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. చైతన్య రాజుకు మద్దతు పలికిన వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని ఏఐసిసి పరిశీలకులకు బొత్స సూచించారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చైతన్య రాజు పార్టీ అభ్యర్థి కాదని, ఆయనకు మద్దతిచ్చే వారిపై చర్యలుంటాయని కొండ్రు చెప్పారు.

Botsa warns Rebel candidates and supporters

టిజి, కాసు ట్విస్ట్

మంత్రులు టిజి వెంకటేష్, కాసు వెంకట కృష్ణా రెడ్డిలు చైతన్య రాజును బలపర్చినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై వారు మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడమని చెప్పారు. రెబల్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల పైన తాము సంతకాలు చేసినట్లు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము తుది వరకు పోరాడుతామన్నారు. పార్టీ నిర్ణయం నచ్చకుంటే తాము బయటకు వెళ్తామే తప్ప పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడమన్నారు. అధిష్టానం సమైక్యాంధ్రకే మొగ్గు చూపితే తాము పార్టీ నుండి బయటకు వస్తామన్నారు.

నాతో మాట్లాడే ప్రయత్నం చేశారు: చైతన్య రాజు

ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తనతో మాట్లాడే ప్రయత్నం చేశారని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని హామీ ఇస్తే నామినేషన్ ఉఫసంహరించుకునే విషయమై ఆలోచిస్తానని చైతన్య రాజు చెప్పారు. కాంగ్రెసు పార్టీకి తాను ఎంతో సేవ చేశానన్నారు. చైతన్య రాజును బలపర్చిన వారిలో జెసి, రమణమూర్తి రాజు, ముత్యాల పాప, అవంతి శ్రీనివాస్, రమేష్, వెంకటరామయ్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+