పెళ్లి కావడం లేదనే నిరాశతో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్/ ఖమ్మం: పెళ్లి కావడంలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో కె.వేణు(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీలోని మార్కెట్‌రోడ్డులో నివాసం ఉంటున్న వేణుకు కొంతకాలంగా కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
ఎన్ని చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనస్తాపం చెందిన వేణు మంగళవారం రాత్రి ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. పనిమీద బయటకు వెళ్లి వచ్చిన అతడి తల్లి పాపమ్మ ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయింది.

స్థానికుల సహకారంతో తలుపులు పగలకొట్టి వేణును ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట మండలం కొత్తఅల్లిగూడెంలో విషజ్వరంతో ఒకరు మృతిచెందారు. ఎనిమిదో తరగతి విద్యార్థి లోకేష్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆస్పత్రిలో చూపించినా.. నయం కాలేదు. గురువారం ఉదయం ఇంట్లోనే మృతిచెందాడు.












Click it and Unblock the Notifications