Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జాగ్రత్తలు తీసుకోవాల్సింది: విద్యుత్ ప్లగ్‌లో వేలు పెట్టి చిన్నారి మృతి

పశ్చిమగోదావరి: చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగానే చూసుకుంటారు. కానీ, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా, జరిగిన విషాద ఘటన ఈ తల్లిదండ్రుల జీవితంలో తీరని విషాదాన్ని నింపింది.

విద్యుత్ ప్లగ్‌లో వేలుపెట్టి ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన అబ్బిండి సురేష్‌, స్వాతి దంపతులకు పూర్ణధర్మతేజ(18 నెలలు) కుమారుడు, నాలుగు నెలల కుమార్తె ఉన్నారు.

 A boy dies after electricity shock in Eluru

కాన్పు కోసం స్వాతి పుట్టిల్లు కృష్ణాజిల్లా బాపులపాడుకు వచ్చి ఇక్కడే ఉంది. గురువారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న పూర్ణధర్మతేజను ఎవరూ గమనించని సమయంలో విద్యుత్‌ ప్లగ్‌లో వేలు పెట్టాడు.

విద్యుదాఘాతానికి గురికావడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. శుక్రవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్షలు చేశారు. రెండేళ్లు కూడా నిండని కుమారుడి మరణంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+