భారీ పేలుడు: బాలుడు మృతి, ముగ్గురు పరిస్థితి విషమం

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామం గంగానమ్మ పేట లో ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం లో ఆరేళ్ళ బాలుడు సంఘటన ప్రాంతం లోనే మృతిచెందాడు. కాగా ప్రమాదం లో మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన గౌతమ్ అనే బాలుడు మృతి తో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాల పాలయ్యారు.అయితే పేలుడు కు గల కారణాలు ఎవ్వరూ బయటకు రానియ్యటం లేదు. ఇంటిలో ఓ డబ్బా లో పేలుడు పదార్ధం నిలువ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.

 Boy dies, three injured in blast in Guntur

ఆ డబ్బాలో ఉన్న పేలుడు పదార్ధం పేలి బాలుడు మృతిచెందాడు. పేలుడు ఎలా సంభవించింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారిలో నాగమణి , భవాని . నాని ఉన్నారు. గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

స్థానికం గా క్వారీ లు ఉండటం తో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్వారీ లలో వాడే పేలుడు పదార్ధాలను ఇంట్లో భద్రపరిచి ఉండవచ్చు అని, వాటికి వత్తిడి తగలడం కారణం గా పేలుడు సంభవించి ప్రమాదం జరిగి ఉంటుంది అని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు ప్రధాన కారణం ఏమిటా అని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అలాగే, గుంటూరు నుండి క్లూస్ టీమ్ ని రప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+