ఇద్దరు యువతులతో ప్రేమ నాటకం: ఫిర్యాదు

విశాఖపట్నం: ఒక యువతిని కొన్నాళ్లు పాటు ప్రేమించి, ఆమెను వదిలేసి మరో యువతిని వలలోకి లాగి ప్రేమనాటకం ఆడుతున్న ఓ యువకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. యువతీయువకులు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఐతే యువకుడు తన ప్రేయసిని కొంతకాలంగా దూరం పెడుతున్నాడు. దాంతో అనుమానం వచ్చిన ప్రేమికురాలు కూపీ లాగింది. దాంతో అసలు విషయం బయపడింది.

తనను ప్రేమించానని చెప్పిన యువకుడు మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకుంది. ఇదేంటని ప్రశ్నించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు ప్రేమికుడు కట్నం కావాలని షరతు పెట్టడంతో ఆమె పోలీసు స్టేషన్ గడప తొక్కింది.

ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై బాధితురాలు సమాచారం ప్రకారం... సత్యనారాయణపురానికి చెందిన యువతి (21) నాగార్జున యూనివర్సిటీలో పీజీ చదువుతోంది. బృందావన్ కాలనీలో నివాసి మహ్మద్ ఇలియాస్ , యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. శారీరకంగా కూడా సన్నిహితులయ్యారు.

Boy Ileas ditches girl at Visakhapatnam

ఇలియాస్ ప్రేమికురాలి వద్ద ఖర్చుల కోసం భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడు. గత ఏడు నెలలుగా ఆమెతో దూరంగా ఉంటూ నిర్లక్ష్యంగా వ్వవహారిస్తున్నాడు. ప్రియుడి తీరుపై ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా, మరో యువితితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇలియాస్ ను నిలదీసింది. వివాహం చేసుకోవాలని కోరగా, పెళ్లాడాలంటే కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దాంతో బాధితురాలు మంగళవారం చుట్టగుంటలోని ఇలియాస్ రెండో ప్రేమికులారి నివాసానికి వెళ్లింది. ఇలియాస్‌తో తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పి, అన్ని రకాలుగా మోసగించాడని వివరించింది. ఆమెను కూడా మోసం చేస్తాడని హెచ్చిరించింది. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.

అనంతరం బాధిత యువతి పటమట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇలియాస్ తనను మోసగించాడని ఫిర్యాదు చేసింది. ఇలియాస్ పై గతంలో సత్యనారాయణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. తాజా ఫిర్యాదును కూడా ఆ స్టేషన్‌కే బదిలీ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+