విశాఖలో బాలుడి కిడ్నాప్, 30లక్షలు డిమాండ్

Boy kidnapped at Visakhapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో ఓ బాలుడి అపహరణ సంచలనం సృష్టించింది. పెందుర్తి సమీపంలోని చింతల అగ్రహారానికి చెందిన కోరుబిల్లి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ దుండగులు అపహరించి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దామోదర్ సోమవారం రాత్రి తన ఇంటికి సమీపంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యకమాన్ని చూసేందుకు బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన దామోదర్ తిరిగి ఇంటికి రాలేదు. దామోదర్ తల్లిదండ్రులు సోమవారం రాత్రి నుంచి తమ కుమారుని కోసం వెతకడం ప్రారంభించారు.

మంగళవారం కూడా వెతికినా ప్రయోజనం కనిపించలేదు. అయితే బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. దామోదర్‌ను కిడ్నాప్ చేశామని, 30 లక్షల రూపాయలు చెల్లిస్తే, బాలుడిని తిరిగి అప్పగిస్తామని ఆ ఫోన్ కాల్ సమాచారం. పావుగంట వ్యవధిలో శ్రీనివాసరావుకు పలు ఫోన్ కాల్స్ వచ్చాయి. వెంటనే శ్రీనివాసరావు పోలీసులకు ఈ విషయాన్ని తెలియచేశారు. గురువారం ఉదయం నుంచి పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల కోసం గాలింపు ప్రారంభించారు.

శ్రీనివాసరావుకు బుధవారం గోపాలపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, పెందుర్తికి సమీపంలోని కొత్తపాలెం దగ్గర నుంచి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఎసిపి సిఎం నాయుడు పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని గాజువాక, మరో బృందాన్ని సబ్బవరం, చోడవరం, మూడో బృందాన్ని నర్సీపట్నం వైపునకు పంపించారు. ఒక బృందం పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ బాలుని ఆచూకీ దొరకలేదు.

కోరుబిల్లి శ్రీనివాసరావు పెందుర్తి ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి పెద్దగా ఆస్తి కూడా లేదు. శత్రువులు కూడా లేరు. ఈ కిడ్నాప్‌ను పోలీసులు సవాలుగా తీసుకున్నారు. కాగా, దామోదర్ కనిపించకపోవడంతో అతని తండ్రి శ్రీనివాసరావు తన కుమారుడు కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+