స్కూల్లో టీచర్‌తో రాసలీలలు, చూసిన బాలుడ్ని చంపారు

పోలీసుల కథనం ప్రకారం... ప్రధానోపాధ్యాయుడు, అదే పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న కౌశల్య మధ్య కొంతకాలం నుండి అక్రమ సంబంధం నడుస్తుండేది. ఓ రోజు వీరిద్దరు పాఠసాలలోనే సరసాలు కొనసాగిస్తుండగా విద్యార్థి చూశాడు. వీరి గుట్టు రట్టు చేస్తాడేమోనని విద్యార్థిని భయపెట్టాలని కౌశల్య ప్రధానోపాధ్యాయుడు అయ్యన్నకు సూచించింది. బాలుడిని మందలించే యత్నంలో అయ్యన్న వంటగదిలో బాలుడిని చితకబాదాడు.
అతని తల పైన గాయం కావడంతో అక్కడికి అక్కడే మృతి తెందాడు దీంతో బాలుడి మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. వీరి ప్రయత్నాలు ఫలించక పోవడంతో రకరకాల కారణాలు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని నిందితులు చెప్పడంతో బాలుడి మృతిపై ఉన్న సందేహాలు బహిర్గతమయ్యాయి. సోమవారం వారిని కావలి కోర్టులో హాజరుపర్చనున్నారు.
ప్రాణం తీసిన మిస్ట్ కాల్!
ఓ మిస్డ్ కాల్ నిండు ప్రాణాన్ని బలిగొంది. మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఎనగర్తి గ్రామానికి చెందిన కనకవ్వ(30)కు ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్నారు. కనకవ్వ స్థానికంగా సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.
కనకవ్వపై అనుమానంతో నర్సింహ తరచుగా గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున కనకవ్వ సెల్‌ఫోన్‌కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో, ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవడు చేశాడు? అంటూ అతను ఆమెను చితకబాదాడు. దెబ్బలకు తాళలేని కనకవ్వ సృహ కోల్పోయింది. తీవ్రగాయాలైన ఆమెను పేట్ బషీరాబాద్ ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications