ఒంగోలులో క్షుద్రపూజలకు చిన్నారి బలి, ఎస్సైకి చుక్కలు చూపిన అల్లరి మూక
అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని మదర్ థెరిస్సా కాలనీలో క్షుద్రపూజలకు రెండు నెలల పసికందును హతమార్చారు. తల్లిదండ్రులే ఈ ఘోరానికి పాల్పడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సైకి చుక్కలు చూపిన అల్లరి మూకలు
విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ఎస్సై కాస్తంత విశ్రాంతి తీసుకుని భార్యతో కలిసి సరదాగా సినిమా చూద్దామని వెళ్లారు. అయితే థియేటర్‌లో అల్లరి మూకలు మళ్లీ విధి నిర్వహణలోకి వచ్చేలా చేశాయి. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

నగరంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై చౌడయ్యకు శ్రీనివాస థియేటర్‌లో సినిమా చూసేందుకు ఆదివారం రాత్రి తన భార్యతో కలిసి థియేటర్‌కు వెళ్లారు. థియేటర్ సినిమా చూస్తున్న సమయంలో అల్లరిమూకలు అల్లరి చేశారు. ఈ క్రమంలో అల్లరి చేయొద్దంటూ ఆయన ఆకతాయిలను వారించారు. మద్యం మత్తులో ఉన్న సదరు అల్లరిమూక ఎస్సై దంపతులపై దాడికి దిగింది.
సినిమా చూద్దామని వచ్చిన తనకు ఈ తరహా ఘటన ఎదురుకావడంతో సదరు ఎస్సై షాక్ తిన్నారు. వెనువెంటనే తేరుకున్న సదరు ఎస్సై తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు అల్లరిమూకల్లోని ఓ ఆకతాయిని అరెస్ట్ చేసి, మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications