అత్యాచారయత్నం చేసిన యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టారు

హైదరాబాద్: ఖమ్మంలోని అంబేద్కర్‌ నగర్‌లోని ఓ బాలికపై యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఆయనను స్థానికులు చెట్టుకు కట్టి చితకబాదారు. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నగరంలో ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

గురువారం పనులు ముగించుకుని అంబేద్కర్‌నగర్‌లో తన గదికి వచ్చిన వెంకటేశ్వరరావు పక్కంటిలో ఉన్న 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు, బిస్కట్లు ఇస్తానని ఆశ చూపించి గదిలోకి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

రైల్వే ఉద్యోగి చెంప చెళ్లుమనిపించిన మహిళ

Boy tries to sexually assault a girl at Khammam

అసభ్యకర మెసేజ్‌‌లు పంపిన వ్యక్తిపై ఓ మహిళ విరుచుకుపడింది. చెంప చెళ్లుమనిపించి కేసు పెట్టింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌లో జరిగింది. అయితే, బాధితురాలు ఫిర్యాదు చేసినా, స్థానిక ఎస్సై వివరాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్‌నగర్‌ జిర్రా ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ముందు ఉన్న సంపులో చిన్నారులను పడేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+