బోయపాటికి తెలిసేనా? లేదంటే తెలియకా?
బోయపాటి శ్రీను అంటేనే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. బోయపాటి రామ్ ను ఎలా చూపిస్తాడో అనే ఉత్కంఠ అందరిలో కలిగింది. అఖండ తర్వాత బోయపాటి పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించారు. మాస్ జాతర జాతర అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.
లాజిక్ అందాలిగా : సినిమా అంటేనే కొన్ని సన్నివేశాలకు లాజిక్స్ ఉండవు. చిన్న చిన్న సన్నివేశాల దగ్గర లాజిక్స్ లేకపోయినా ఇబ్బంది ఉండదు.. సినిమా చూసే ప్రేక్షకులు ఇది సినిమానేకదా అని సరిపెట్టుకుంటారు. అలా కాకుండా లాజిక్ లేకుండా సినిమా చేస్తే దాన్ని ఏమంటారు? బోయపాటికే తెలియాలి. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీస్తాను అంటారు బోయపాటి. అయితే ఎవరూ ఊహించని రీతిలో, ఎన్నడూ చూడని సన్నివేశాలను సినిమాల్లో పెట్టేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే స్కంద చిత్రం గురించి. సినిమా హిట్ అయిందికదా.. ఇప్పుడెందుకివన్నీ అనేవారు కూడా ఉన్నారు.

స్వేచ్ఛ ఎక్కువగా తీసుకున్నాడు : స్కంద చిత్రంలో లాజిక్స్ గురించి చర్చ నడుస్తోంది. ట్రాక్టరును బైకును తిప్పినట్లు తిప్పడంతోపాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రతినాయకులుగా చూపించారు. హీరో వారిని ఓ ఆట ఆడుకుంటాడు. సెక్యూరిటీని ఆటాడించి ముఖ్యమంత్రి ఇళ్లల్లోకి వెళ్లడం ఎవరికైనా సాధ్యపడుతుందా? ముఖ్యమంత్రి భయపడి నీకు కావల్సింది తీసుకుపో అంటే వారి కూతుళ్లను కిడ్నాప్ చేసి తీసుకువెళతారు. నిజజీవితంలో ఇలాంటివి కష్టం. మరో సీన్లో అయితే గవర్నర్ ఒక సీఎంను మరో సీఎంకు పరిచయం చేస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండరుగా. ఇవన్నీ చూసిన తర్వాత బోయపాటి స్వేచ్ఛ ఎక్కువ తీసుకున్నాడనిపిస్తుంది. అంతేకాదు తెలిసి తీస్తున్నాడా? తెలియక తీస్తున్నాడా? అనే అనుమానం కూడా కలుగుతుంది.












Click it and Unblock the Notifications