రాష్ట్రం ముక్కలైతేనేం.. బాబుతో ఢోకా లేదు: బోయపాటి
హైదరాబాద్/గుంటూరు/విజయవాడ: హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను కూడా చంద్రబాబుకు, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రకు బంగారు భవిష్యత్తు బాబు వల్లే సాధ్యమని పేర్కొన్నారు.
రాష్ట్రం రెండు ముక్కలయిందని, ఆంధ్రుల ఆశలు ఆవిరి అయ్యాయని, అయితేనేం ఇప్పుడు వారి భవిష్యత్తుకు ఢోకా ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన పరిపాలనతో బంగారు బాట వేసేందుకు ఆయన వచ్చేశారని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు.

నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని, ఆయన నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలలు సాకారమవుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి తన అభినందనలు అని చెప్పారు.
కాగా, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది అభిమానులు, వివిఐపిలతో కళకళలాడుతోంది. బోయపాటి శ్రీను కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications