డేంజరస్ ఇంజక్షన్లతో ప్రేయసిని చంపేశాడు.. విశాఖ మన్యంలో ఉన్మాది ఘాతుకం

విశాఖపట్నం జిల్లా పాడేరు మన్యంలో తీవ్ర కలకలం రేపిన యువతి అనుమానాస్పద మతి కేసును పోలీసులు ఛేదించారు. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే ప్రియుడే ఆమెకు డేంజరస్ ఇంజక్షన్లు ఇచ్చి చంపేశాడని ఎంక్వైరీలో తేలింది. కొన్ని గంటల కిందటే నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పాడేరు పాడేరు డీఎస్పీ.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

 ల్యాబ్ టెక్నీషియన్ ..

ల్యాబ్ టెక్నీషియన్ ..

అరకుకు చెందిన దుక్కేరి ప్రసాద్ కు ల్యాబ్ టెక్నీషియన్ గా మంచి అనుభవముంది. ఔట్ సోర్సింగ్ విధానంలో పాడేరు గవర్నమెంట్ ఆస్పత్రిలో పనిచేసేవాడు. పాడేరులోనే ప్రైవేట్ గా మరో ల్యాబ్ నడిపేవాడు. బీఈడీ పూర్తిచేసి, డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతోన్న కనకరత్నం అనే యువతి పార్ట్ టైమ్ జాబ్ గా ప్రసాద్ ల్యాబ్ లో చేరింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో ప్రసాద్ కు ఆమె దగ్గరైంది. నెలలు గడుస్తున్నా పెండ్లి ఊసెత్తకపోయేసరికి అతణ్ని నిలదీసింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్న ప్రసాద్.. టైమ్ కోసం ఎదురుచూశాడు.

బ్లడ్ టెస్ట్ పేరుతో భయానక కుట్ర

బ్లడ్ టెస్ట్ పేరుతో భయానక కుట్ర

కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కనకరత్నం ఈనెల 13న ల్యాబ్ కు వెళ్లి ప్రసాద్ ను కలిసింది. అదే అవకాశంగా భావించిన ఉన్మాది ప్రసాద్.. బ్లడ్ టెస్టులు చేస్తానంటూ ఆమె ఒంట్లోకి హైపవర్ ఇంజక్షన్లు ఎక్కించాడు. కొద్ది నిమిషాలకే ఇంజక్షన్ వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రసాద్ మాత్రం దాన్నొక సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. యువతి కుటుంబీకులు, బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఉరి తీస్తారా.. నన్నే ఉరేసుకోమంటారా..

ఉరి తీస్తారా.. నన్నే ఉరేసుకోమంటారా..

ఘాతుకం బయటపడటంతో ఊరొదిలి పారిపోయిన ప్రసాద్.. చివరికి పాడేరు డీఎస్పీ ముందు లొంగిపోయాడు. కనకరత్నాన్ని హత్యచేసింది తానేనని ఒప్పుకున్నాడు. నిందితుణ్ని వెంటనే ఉరి తీయాలని కనకరత్నం తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిందితుడికి శిక్ష పడకుంటే.. పాడేరు పోలీస్ స్టేషన్ ముందు తానే ఉరిపోసుకుని చనిపోతానని ఆ తండ్రి హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+