Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

28వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్; పాదయాత్రకు నెల్లూరు నేతన్నల మద్దతు!!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఈరోజు 28 వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతులు ప్రారంభించిన మహా పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా ఇబ్బందుల మధ్య, పోలీసుల ఆంక్షల మధ్య అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది.ప్రకృతి కూడా మరావతి రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నా క్రమంలోనూ మొక్కవోని దీక్షతో రాజధాని సాధనకు రైతుల పోరాటం కొనసాగుతుంది.

 28వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్ .. కారణం ఇదే

28వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్ .. కారణం ఇదే

మూడు రాజధానులను నిరసిస్తూ, సిఆర్డిఏ బిల్లు రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతుల మహా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నేడు 28వ రోజు జరగవలసిన పాదయాత్రకు బ్రేక్ పడింది. భారీ వర్షాల దృష్ట్యా పాదయాత్రకు బ్రేక్ వేసినట్లుగా, ఈరోజు పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లుగా అమరావతి కార్యాచరణ సమితి వెల్లడించింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఇప్పటికీ ఒకసారి రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ వేశారు. అయితే మరోమారు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్న ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఆదివారం నాడు మరోమారు పాదయాత్రకు బ్రేక్ వేశారు రాజధాని రైతులు.

 శనివారం రాజధాని రైతుల పాదయాత్ర సాగిందిలా

శనివారం రాజధాని రైతుల పాదయాత్ర సాగిందిలా

ఇదిలా ఉంటే శనివారం రోజు ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు సాగిస్తున్న మహాపాదయాత్ర 27వరోజు కొనసాగింది. నెల్లూరులో బసచేసిన జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించిన రైతులు సేవ్ అమరావతి పేరుతో అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ 12కిలోమీటర్ల మేర నడక సాగించారు. ఇక పాద యాత్ర సాగిస్తున్న అమరావతి రైతులకు నిన్న వివిధ వర్గాల నుండి విశేష మద్దతు లభించింది.

మహిళా రైతులకు చీరలు పెట్టి మరీ ..రాజధాని రైతులకు నేతన్నల మద్దతు

మహిళా రైతులకు చీరలు పెట్టి మరీ ..రాజధాని రైతులకు నేతన్నల మద్దతు

నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. పాదయాత్ర చేస్తున్న మహిళలకు నేతన్నలు చీరలు పెట్టి మరీ మద్దతు తెలిపారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. జగన్ఇచ్చే మంత్రిపదవులకు ఆశపడి తమను అవమానించొద్దని.. అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న మహిళలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అమరావతి పోరాటానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అడుగడుగునా అవరోధాలు .. అయినా ఆగని మహా పాదయాత్ర

అడుగడుగునా అవరోధాలు .. అయినా ఆగని మహా పాదయాత్ర


న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన పాదయాత్ర వివిధ జిల్లాలలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని విస్తరించడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి, న్యాయస్థానంలో న్యాయం జరగాలని, దేవస్థానంలో ధర్మం గెలవాలని సాగిస్తున్నారు. తుళ్లూరు నుండి తిరుమల తిరుపతికి పాదయాత్ర సాగిస్తున్న అమరావతి రైతు మహా పాదయాత్రకు ఈరోజు బ్రేక్ పడటంతో బస చేసిన చోటే వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. అడుగడుగునా అనేక అవరోధాలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క పోలీసుల ఆంక్షలు, మరో పక్క పాదయాత్రకు అనుకూలించని వాతావరణ పరిస్థితులు వెరసి పాదయాత్ర అనేక ఇబ్బందుల మధ్య కొనసాగుతుంది.

వర్షాలతో మహా పాదయాత్ర చేస్తున్న రైతులకు ఇబ్బందులు .. అయినా సరే ఆగని రైతు పోరాటం

వర్షాలతో మహా పాదయాత్ర చేస్తున్న రైతులకు ఇబ్బందులు .. అయినా సరే ఆగని రైతు పోరాటం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రద్దు చేసే వరకు పోరాటం చేసి తీరుతామని తేల్చి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని, ఏకైక రాజధానిగా అమరావతి నగరాన్ని మాత్రమే చూడాలని అమరావతి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా, రాత్రి సమయాల్లో బస చేసే చోట అనేక ఇబ్బందులు తలెత్తుతున్నా, రైతులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా సరే పాదయాత్ర సాగిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+