ఏపీలో వాలంటీర్ల రాజీనామాలకు బ్రేక్ ? ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం..
ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వారిని తప్పిస్తూ గతంలో ఈసీ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఏకంగా 44 వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. అంతే కాదు వైసీపీ ప్రచారంలో నేరుగా పాల్గొనడం మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల రాజీనామాల్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జిరిపిన హైకోర్టు ఇవాళ ఈసీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇప్పటికే భారీ ఎత్తున వాలంటీర్లు తమ విధులకు రాజీనామా సమర్పించి వైసీపీ ప్రచారంలోకి చేరిపోతున్న తరుణంలో హైకోర్టు ఇవ్వబోయే ఆదేశాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 44 వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేసినా ప్రభుత్వం కానీ ఈసీ కానీ వాటినీ ఆమోదించినట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ రామచంద్రయాదవ్.. వీటిని ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో రేపు హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications