పిడుగుపాటుకు వధువు మృతి: వృద్ధ దంపతుల హత్య
వరంగల్: వరంగల్ జిల్లా కంభాళపల్లిపూరి తండాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు పెళ్లి కూతురు మరణించింది. దీంతో పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఇదిలావుంటే, వరంగల్ నగరశివారు గొర్రెకుంట ప్రాంతంలోని కీర్తినగర్ కాలనీలో వృద్ధదంపతులు హత్యకు గురయ్యారు. భర్తను మొదట గొంతుకు చీరను కట్టి ఊపిరాడకుండా చేసి, ఆ తరువాత దిండును మొహంపై పెట్టి అదిమి హత్య చేశారు. భార్యను కత్తితో గొంతుకోసి చంపారు.
చింతల శేఖరయ్య (75), ఆయన భార్య సుగుణమ్మ (70) వరంగల్ నగరశివారులోని కీర్తినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కూతురు అత్తవారింట్లో ఉండగా, కుమారుడు హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నాడు. సోమవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా శేఖరయ్య, సుగుణమ్మ హత్య కాబడి ఉండటం గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది.

పోలీసులకు ఈ సమాచారం అందడంతో గీసుగొండ పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. సుగుణమ్మ ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, నల్లపూసలు, కమ్మలు హంతకులు ఎత్తుకుపోయినట్లు పనిమనిషి ద్వారా పోలీసులు నిర్థారించారు. వృద్ధులు ఇద్దరు తప్ప ఇంట్లో మరెవరు ఉండకపోవడంతో ఈ సంఘటనలో ఎంత మేరకు డబ్బు, నగలు చోరీకి గురయింది పోలీసులు నిర్థారించలేకపోతున్నారు. ఈ చర్య వెనక మృతుల కుటుంబాలకు తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సాధారణంగా శేఖరయ్య, సుగుణమ్మ రాత్రిపూట ఎవరైన తలుపులు కొడితే వచ్చింది ఎవరో నిర్థారించుకునే వరకు తలుపులు తీసేవారు కాదని, ఆగంతకులు రాత్రిపూట ఇంట్లోకి రావడం గమనిస్తే శేఖరయ్య కుటుంబసభ్యులకు తెలసిన వ్యక్తులుగానే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications