Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డబ్బు కోసం బ్యాంకు ఎదుట పెళ్ళికూతురు పడిగాపులు

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా పెళ్ళికూతురు విశాఖ జిల్లా దేవరాపల్లిలోని యూకో బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. డిసెంబర్ 21వ, తేదిన జరిగే వివాహం కోసం బ్యాంకు చుట్టూ పెళ్ళికూతురు తిరుగుతోంది.

విశాఖఫట్టణం :పెద్ద నగదు నోట్ల రద్దు పెళ్ళిళ్ళపై తీవ్రంగానే కన్పిస్తోంది. ఆర్ బి ఐ అధికారుల నిబంధనల కారణంగా పెళ్ళి చేసుకొనే జంటలు కూడ రోడ్డన పడ్డారు . వధువు, వరుడు కుటుంబసభ్యులు కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతున్నారు.విశాఖ జిల్లాల్లో సాక్షాత్తూ పెళ్ళికూతురు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావంతో పెళ్ళికూతురు కూడ నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని మారేపల్లి చెందిన నారాయణమూర్తి, అచ్చియమ్మ దంపతుల కూతురు రాముకు డిసెంబర్ 21వ, తేదిన వివాహం చేయాలని నిశ్చయించారు.

ఈ వివాహం కోసం బ్యాంకులో 1.80 లక్షలను తీసుకొనేందుకు వారం రోజులుగా కుటుంబసభ్యులు బ్యాంకు చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు.అయినా ఫలితం లేకపోయింది. నవంబర్ 25వ, తేదిన పెళ్ళి పనులు ప్రారంభించాలని పురోహితులు సూచించాడు. ఈ పనులు ప్రారంభించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదని వారు వాపోతున్నారు.

 bride waiting for money at bank

బ్యాంకులో ఉన్న నగదును తీసుకొనేందుకు నారాయణమూర్తి దంపతులు వెళ్ళారు. నిబంధలను అధికారులు సాకుగా చూపారు. అయితే చేతిలో డబ్బులు లేని కారణంగా ఒక్క పని కూడ చేయలేకపోతున్నామని పెళ్ళికూతురే బ్యాంకు అధికారులను కలిసింది. తనగోడును వివరించింది. వారానికి 24 వేలకు మించి ఇవ్బలేమని తేల్చి చెప్పింది.

వారానికి ఇచ్చే 24 వేల నగదును తీసుకొనేందుకు పెళ్ళికూతురు గురువారం నాడు సాయంత్రం వరకు బ్యాంకు వద్దే వేచి చూసింది. కాని, బ్యాంకుకు నగదే రాలేదు. నగదు రాని కారణంగా పెళ్ళికూతురుకు నగదు ఇవ్వలేకపోయినట్టు యూకో బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వివాహం కోసం నగదు ఉపసంహరణ కోసం ఆర్ బి ఐ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు పెళ్ళిళ్ళపై తీవ్రంగానే కన్పిస్తోంది. ఆర్ బి ఐ అధికారుల నిబంధనల కారణంగా పెళ్ళి చేసుకొనే జంటలు కూడ రోడ్డన పడ్డారు . వధువు, వరుడు కుటుంబసభ్యులు కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతున్నారు.విశాఖ జిల్లాల్లో సాక్షాత్తూ పెళ్ళికూతురు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+